TS Inter Hall Ticket 2024 : తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు - ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు
TSBIE Inter Hall Ticket 2024: తెలంగాణ ఇంటర్మీడియట్ రాసే అభ్యర్థులు హాల్ టికెట్లను ఇవాళ్టి నుంచి పొందవచ్చు. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు..
TSBIE Inter Hall Ticket 2024 Updates: తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. మార్చి 18వ తేదీతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు ఉండనున్నాయి. పరీక్షలకు ప్రారంభం కావటానికి టైం కూడా దగ్గరపడింది. ఈ నేపథ్యంలో…. ఇవాళ హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
లింక్ ఇదే…
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలనే విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్(inter first year hall ticket 2024) హాల్ టికెట్లు - 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ ఇయర్ విద్యార్థులు…. కూడా ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లి ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు - 2024(inter second year hall ticket 2024) అనే ఆప్షన్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో తప్పులు ఉంటే విద్యార్థులు సరిచేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పరీక్ష ఫీజు గడువు ముగియటంతో… ఈసారి పరీక్ష రాయబోయే విద్యార్థుల సంఖ్యతో పాటు ఎగ్జామ్ సెంటర్ల వివరాలను పేర్కొంది. ఈ ఏడాది 9 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నట్లు తెలిపింది. ఇందులో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. మొత్తం కలిపి 9,22,520 మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
28 -02- 2024 : సెకండ్ లాగ్వేజ్
01 -03- 2024 : ఇంగ్లీష్
4-03- 2024 : మ్యాథ్య్ 1, Botny, పొలిటికల్ సైన్స్ -1
6-03- 2024 : మ్యాథ్స్ - 2, జువాలజీ, హిస్టరీ
11-03- 2024 : ఫిజిక్స్, ఏకానమిక్స్ -1,
13-03- 2024 : కెమిస్ట్రీ, కామర్స్
15-03- 2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -1
18-03- 2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ -1.
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
29 -02- 2024 : సెకండ్ లాగ్వేజ్
20 -03- 2024 : ఇంగ్లీష్ 2
5-03- 2024 : మ్యాథ్య్ 2A, Botny 2, పొలిటికల్ సైన్స్ -2
7-03- 2024 : మ్యాథ్స్ - 2B, జువాలజీ, హిస్టరీ
12-03- 2024 : ఫిజిక్స్, ఏకానమిక్స్ ,
14-03- 2024 : కెమిస్ట్రీ, కామర్స్ - 2
16-03- 2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -1
19-03- 2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ -2.
ఇంటర్ పరీక్షలు, ఫలితాల నేపథ్యంలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు ‘టెలి-మానస్’ సేవలను ఇంటర్ బోర్డు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒత్తిడి ఫీల్ అయ్యే విద్యార్థులు టెలీ - మానస్ కు కాల్ చేసి నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఇందుకోసం వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్ సేవలను ఉచితంగా వినియోగించుకోనున్నట్లు తెలిపింది. విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని వెల్లడించింది. ఈ టెలి మానస్(Tele Mental Health Assistance and Networking Across States) ద్వారా విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వడమేగాక మార్గదర్శనం చేయనున్నట్టు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. భయం, ఆందోళన, ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రయత్నిస్తారని... ఇవే కాకుండా ప్రభుత్వ దవాఖానల్లో జిల్లా మెంటల్ హెల్త్ క్లినిక్‌ల సేవలను 24 గంటల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని వివరించింది.