TSPSC group 4 notification: అలర్ట్… నేటి నుంచే గ్రూప్‌ - 4 దరఖాస్తులు-tspsc group 4 applications start from today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 4 Notification: అలర్ట్… నేటి నుంచే గ్రూప్‌ - 4 దరఖాస్తులు

TSPSC group 4 notification: అలర్ట్… నేటి నుంచే గ్రూప్‌ - 4 దరఖాస్తులు

HT Telugu Desk HT Telugu
Dec 30, 2022 07:45 AM IST

TSPSC Group 4 Jobs 2022: గ్రూప్ 4 కేటగిరి కింద 9,168 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

 9,168 గ్రూప్ 4 ఉద్యోగాలు
9,168 గ్రూప్ 4 ఉద్యోగాలు

Group 4 Jobs in Telangana 2022: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వరుసగా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 4 రాగ.. తాజాగా గ్రూప్ 2 ప్రకటన కూడా విడుదలైంది. మరోవైపు పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అయితే గ్రూప్ 4 ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచి(డిసెంబర్ 30) దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. నిజానికి ఇంతకుముందే దరఖాస్తుల ప్రక్రియన ప్రారంభం కావాల్సినప్పటికీ... పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు గ్రూప్ 4 దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9168 ఉద్యోగాలను టిఎస్‌పిఎస్సీ భర్తీ చేయనుంది. గ్రూప్4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్ అంచనా వేస్తోంది. https://tspsc.gov.in/ లింక్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఓటీఆర్ తప్పనిసరిగా ఉండాలి.

9,168 పోస్టులు

మెుత్తం 9,168 పోస్టుల భర్తీకి కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ప్రకటించింది. గ్రూప్‌ 4లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖ 1,245 పోస్టులు, 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, 18 జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలోని గ్రూప్ 2లో 663 పోస్టులు గుర్తిస్తూ.. టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు ఇచ్చింది.

పోస్టుల వివరాలు

అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్ మెంట్-44, యనిమల్ హస్పెండరీ, డెయిరీ డెవలప్ మెంట్ అండ్ ఫిషరీస్-2, బీసీ వెల్ఫేర్-307, కన్స్యూమర్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్ మెంట్-72, ఎనర్జీ డిపార్ట్ మెంట్-2, ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్-23, ఫైనాన్స్-255, జనరల్ అడ్మినిస్ట్రేషన్-5, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్-338, ఉన్నత విద్యాశాఖ-742, హోమ్ డిపార్ట్ మెంట్-133, పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ-7, వ్యవసాయ శాఖ-51, కార్మిక, ఉపాధి కల్పన శాఖ-128, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్-191, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్-2701, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్-1245, ప్లానింగ్ డిపార్ట్ మెంట్-2, రెవెన్యూ-2077, ఎస్సీ డెవలప్ మెంట్-474, సెకండరీ ఎడ్యూకేషన్-97, ట్రాన్స్ పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్-20, ట్రైబల్ వెల్ఫేర్-221, స్త్రీ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ-18, యూత్, టూరిజం, కల్చర్-13

ఇదిలా ఉంటే లక్షలాది మంది ఎదురుచూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం ప్రకటన జారీ చేసింది. మొత్తం 783 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 18 శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 783 పోస్టులను భర్తీ చేయనుంది టీఎస్‌పీఎస్సీ. జనవరి 18 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IPL_Entry_Point