TSPSC Group 2 Jobs: 783 గ్రూప్ -2 పోస్టులు.. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలంటే-telangana group 2 post vise vacancies in various departments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 2 Jobs: 783 గ్రూప్ -2 పోస్టులు.. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలంటే

TSPSC Group 2 Jobs: 783 గ్రూప్ -2 పోస్టులు.. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలంటే

Mahendra Maheshwaram HT Telugu
Dec 30, 2022 06:00 AM IST

Group 2 Notification in Telangana: లక్షలాది మంది ఎదురుచూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ రానే వచ్చేసింది. మొత్తం 783 పోస్టులను భర్తీ చేయనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మేరకు ఖాళీల వివరాలను చూస్తే.....

గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల
గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల (facebook)

Telanagana Group 2 Jobs 2022: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసినప్పటి నుంచి వరుసగా నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ డిసెంబర్ నెలలో మాత్రం పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వచ్చాయనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే లక్షలాది మంది ఎదురుచూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం ప్రకటన జారీ చేసింది. మొత్తం 783 పోస్టులను భర్తీ చేయనుంది. శాఖల వారీగా పోస్టుల వివరాలు చూస్తే కింది విధంగా ఉన్నాయి...

ఉద్యోగాల వివరాలు:

-మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో మున్సిపల్ కమిషనర్‌ గ్రేడ్ 3 పోస్టులు – 11

-కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌ – 59

-ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో నయిబ్ తహసిల్దార్ పోస్టులు – 98

-రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్‌లో సబ్-రిజిస్ట్రార్ ఖాళీలు – 14

-రిజిస్ట్రార్ ఆఫ్ కో- ఆపరేటివ్ సొసైటీస్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఫర్ కో-ఆపరేషన్ పోస్టులు ‌- 63

-కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఖాళీలు – 09

-పంచాయ‌త్ రాజ్, రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో మండ‌ల పంచాయ‌త్ ఆఫీస‌ర్ (ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌) పోస్టులు – 126

-ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్- 97

-హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్ డిపార్ట్‌మెంట్‌లో- అసిస్టెంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ – 38

-జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ ఖాళీలు – 165

-లెజిస్లేటివ్ సెక్రెటేరియ‌ట్‌లో అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ 15

-ఆర్థిక శాఖ‌లో అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ – 25

-న్యాయ శాఖ‌లో అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ – 07

-తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంలో అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ – 02

-జువెనైల్ క‌రెక్ష‌న‌ల్ స‌ర్వీసెస్‌, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్ర‌న్ డిపార్ట్‌మెంట్‌లో డిస్ట్రిక్ ప్రొబేష‌న్ ఆఫీస‌ర్ గ్రేడ్ 3 పోస్టులు – 11

-బీసీ సంక్షేమ శాఖ‌లో అసిస్టెంట్ బీసీ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ – 17

-గిరిజ‌న సంక్షేమ శాఖ‌లో అసిస్టెంట్ ట్రైబ‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ – 09

-షెడ్యూల్డ్ తెగ‌ల అభివృద్ధి శాఖ‌లో అసిస్టెంట్ సోష‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ – 17

పోస్టుల వివరాలు
పోస్టుల వివరాలు (tspsc)

మొత్తం 18 శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 783 పోస్టులను భర్తీ చేయనుంది టీఎస్‌పీఎస్సీ. జనవరి 18 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను సందర్శించాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.

IPL_Entry_Point