TSPSC Group 2 Notification: 783 పోస్టులతో గ్రూపు - 2 నోటిఫికేషన్ విడుదల-tspsc issued notification for 783 group 2 jobs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 2 Notification: 783 పోస్టులతో గ్రూపు - 2 నోటిఫికేషన్ విడుదల

TSPSC Group 2 Notification: 783 పోస్టులతో గ్రూపు - 2 నోటిఫికేషన్ విడుదల

Mahendra Maheshwaram HT Telugu
Dec 29, 2022 07:56 PM IST

Telangana Group 2 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఎట్టకేలకు గ్రూప్ - 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులను భర్తీ చేయనుంది.

గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల
గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

Telangana Group 2 Notification:తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఇవ్వగా.. తాజాగా కీలకమైన గ్రూప్ 2 ప్రకటన ఇచ్చింది. మొత్తం 783 గ్రూప్-2 ఖాళీలను భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 18 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. పూర్తి వివరాలు, నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్https://www.tspsc.gov.in/ ను సందర్శించాలని టీఎస్పీఎస్సీ సూచించింది.

ఉద్యోగాల వివరాలు
ఉద్యోగాల వివరాలు (tspsc)

తాజాగా గ్రూప్-2లోకి కొత్త పోస్టులు..

గ్రూప్‌-2 పరిధిలో ప్రస్తుతం 16 రకాల సర్వీసు ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కేటగిరీలోకి మరో ఆరు కేటగిరీల పోస్టులను తాజాగా ప్రభుత్వం చేర్చిన సంగతి తెలిసిందే. సహాయ సెక్షన్‌ అధికారి(రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సేవలు), సహాయ సెక్షన్‌ అధికారి(ఇతర విభాగాలు), జిల్లా ప్రొబేషనరీ అధికారులు(జువైనల్‌ విభాగం), సహాయ బీసీ సంక్షేమ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పోస్టుల్ని కొత్తగా చేర్చింది. దీంతో గ్రూప్‌-2 పరిధిలోకి మొత్తం 22 రకాల పోస్టులు వచ్చాయి. కొత్తగా చేర్చిన వాటిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.

బుధవారం కూడా మరో రెండు నోటిఫికేషన్లు ఇచ్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులతో పాటు, ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రకటనలు ఇచ్చింది. అగ్రికల్చర్ అండ్ కో ఆపరేటివ్ విభాగంలో 148 ఏఓ పోస్టులను, 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. విద్యాశాఖలో 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. సాంకేతిక విద్యాశాఖలో 37, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. జనవరి 6వ తేదీ నుంచి అదే నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 6 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 27ను తుది గడువుగా నిర్ణయించారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 30 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌ tspsc.gov.in లో సంప్రదించాలని సూచించింది

Whats_app_banner