TS EAPCET 2024 Key : తెలంగాణ ఎంసెట్ అప్డేట్స్ - ఇంజినీరింగ్ స్ట్రీమ్ 'కీ' కూడా వచ్చేసింది, ఇదిగో డైరెక్ట్ లింక్
TS EAPCET 2024 Latest Updates: తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీ లు విడుదలయ్యాయి. వెబ్ సైట్ లోకి వెళ్లి రెస్పాన్స్ షీట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TS EAPCET 2024 Key Update: తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) పరీక్షలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేంది. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. అయితే కీలకమైన ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష ప్రాథమిక 'కీ' లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2,54,543 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే, గతేడాదితో పోల్చితే ఈసారి ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు ఎక్కువ మంది అప్లయ్ చేసుకున్నారు.
TS EAPCET 2024 Key Download : ఇంజినీరింగ్ స్ట్రీమ్ కీ ఇలా పొందండి…
- ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు రాసిన అభ్యర్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీ అనే ఆప్షన్ పై నొక్కాలి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ , రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీచేయాలి.
- PROCEED బటన్ పై నొక్కితే కీ డిస్ ప్లే అవుతుంది.
TS EAPCET 2024 Response Sheet : రెస్పాన్స్ షీట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- TS EAPCET (*ఎంసెట్) అభ్యర్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే TS EAPCET 2024 Response Sheet అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ , రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీచేయాలి.
- get response sheet బటన్ పై నొక్కితే డిస్ ప్లే అవుతుంది.
- ప్రాథమిక కీ పై అభ్యంతరాలు ఉంటే మే 14 ఉదయం 10 గంటల వరకు పంపుకోవచ్చు.
మరోవైపు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 7, 8 తేదీల్లో నిర్వహించిన ఈఏపీసెట్(ఎంసెట్) పరీక్షలకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రాథమిక కీ లను వెబ్ సైట్ లో ఉంచారు. రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాలను కూడా విడుదల చేశారు. వీటిని https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీపై అభ్యంతరాలు ఉంటే మే 13వ తేదీలోపు తెలియజేయవచ్చు.
తెలంగాణ ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలు మే 9న ప్రారంభమై… 11తో ముగిశాయి. మొత్తంగా ఇంజినీరింగ్ విభాగానికి మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేయగా... వీరిలో 2,40,617 మంది పరీక్షలు రాశారు. ఇక ఫార్మసీ విభాగం పరీక్షలకు 1,00,432 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 91 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
TS EAPCET Results 2024 - ఫలితాలు ఎప్పుడంటే…?
తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలు పూర్తి కావటంతో ఫలితాలపై దృష్టిపెట్టారు అధికారులు. మొత్తం ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే.... మే 25వ తేదీలోపు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇది కుదరకపోతే మే 27వ తేదీలోపు దాదాపుగా ప్రకటించవచ్చు. రిజల్ట్స్ పై ప్రకటన త్వరలోనే జేఎన్టీయూ(హైదరాబాద్) అధికారికంగా ప్రకటన చేయనుంది.
HT తెలుగులో ఈఏపీసెట్ ఫలితాలు...
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈఏపీసెట్(ఎంసెట్ ) ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు.
- విద్యార్థులు హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ https://telugu.hindustantimes.com/telangana-board-result లోకి వెళ్లాలి.
- తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు - 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.