TS Gurukulam Jobs : ఆగస్టు 1 నుంచి గురుకుల నియామ‌క ప‌రీక్ష‌లు - ఈ నెల 24న హాల్ టికెట్లు-ts gurukulam recruitment exams start from 1st august 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Gurukulam Jobs : ఆగస్టు 1 నుంచి గురుకుల నియామ‌క ప‌రీక్ష‌లు - ఈ నెల 24న హాల్ టికెట్లు

TS Gurukulam Jobs : ఆగస్టు 1 నుంచి గురుకుల నియామ‌క ప‌రీక్ష‌లు - ఈ నెల 24న హాల్ టికెట్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 21, 2023 10:01 AM IST

TS Gurukul Recruitment 2023:గురుకుల ఉద్యోగ అభ్యర్థులకు మరో అప్డేట్ ఇచ్చింది రిక్రూట్ మెంట్ బోర్డు. ఆగస్టు 1వ తేదీ నుంచి నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 24 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణ గురుకుల పరీక్షలు
తెలంగాణ గురుకుల పరీక్షలు

Telangana Gurukul Recruitment: తెలంగాణలోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 1 నుంచి 23 తేదీ వరకు గురుకుల నియామక పరీక్షలు నిర్వహించాలని రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయించింది. ఈ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే హాల్ టికెట్లను జులై 24వ తేదీన విడుదల చేస్తామని పేర్కొంది. మొత్తం 9 నోటిఫికేషన్ల ద్వారా... 9,210 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆగస్టు 1 నుంచి 23 వరకు జరిగే ఈ రాత పరీక్షలు మొత్తం మూడు షిఫ్టులో ఉంటాయి. మొదటి షిఫ్టు పరీక్ష 8.30 నుంచి 10.30 గంటలు; రెండో షిఫ్టు పరీక్ష 12.30 నుంచి 2.30 గంటలు; మూడో షిఫ్టు పరీక్ష 4.30 నుంచి 6.30 గంటల వరకు ఉంటుంది. గురుకుల పోస్టులకు పేపర్‌ 1 పరీక్షలు అగస్టు 10, 11, 12 తేదీల్లో ఉంటాయి. ఇక ఆగస్టు 1 నుంచి 7 వరకు జేఎల్‌, డీఎల్‌, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్స్‌, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్‌ పేపర్‌ 2 పరీక్షలు నిర్వహించనున్నారు.

పోస్టుల వివరాలు :

జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, పీడీ - 2008

డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ - 868

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) -1276

ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4020

లైబ్రేరియ‌న్ స్కూల్- 434

పీజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ - 275

డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ -134

క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్- 92

మ్యూజిక్ టీచ‌ర్స్- 124

రాతపరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా(సీబీఆర్‌టీ)గా నిర్వహించనుంది గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు. రాష్ట్రంలో ఉద్యోగ నియామక పేపర్లు లీక్ కావటంతో… అలాంటి ఘటనలకు అవకాశం లేకుండా గట్టి చర్యలు చేపడుతోంది. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయాలని చూస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం