TG ST Study Circle : ఎస్టీ అభ్యర్థులకు పోటీ పరీక్షల ఫౌండేషన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ, ఇలా దరఖాస్తు చేసుకోండి
TG ST Study Circle : తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఎస్టీ అభ్యర్థులకు గ్రూప్స్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు ఉచితంగా ఫౌండేషన్ కోర్సులలో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని వరంగల్ లోని ఎస్టీ స్టడీ సర్కిల్ టీజీపీఎస్సీ గ్రూప్-1, 2, 3, 4, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, పోలీస్, ఇతర పోటీ పరీక్షలకు అవసరమయ్యే ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని అభ్యర్థులు ఆన్‌లైన్ https://studycircle.cgg.gov.in/tstw లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అక్టోబర్ 27 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోచ్చని తెలిపింది.
అర్హతలు
1. షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
2. విద్యార్హత - గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ
3. వయో పరిమితి - పోటీ పరీక్షల నోటిఫికేషన్‌ల ప్రకారం
4. అభ్యర్థులు, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ
5. ఉద్యోగం చేస్తున్న లేదా రెగ్యులర్/కరస్పాండెన్స్ కోర్సులు చదువుతున్న అభ్యర్థులు అనర్హులు
6. ఇప్పటికే ఏదైనా ప్రభుత్వ స్టడీ సర్కిల్ నుంచి కోచింగ్ సౌకర్యాన్ని పొందిన అభ్యర్థులు అనర్హలు
7. ఉమ్మడి వరంగల్ జిల్లా (ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం) అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
సీట్ల కేటాయింపు
- మహిళలకు 33 1/3 శాతం
- PHC - 3 శాతం
ఎంపిక విధానం
స్క్రీనింగ్ పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తు ఫారమ్ https://studycircle.cgg.gov.in/tstw వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ తేదీ - 18.10.2024
- దరఖాస్తు ఫారమ్‌ల సమర్పణకు చివరి తేదీ - 27.10.2024
- హాల్ టికెట్ డౌన్‌లోడ్- 31.10.2024
- స్క్రీనింగ్ టెస్ట్ - 03.11.2024
- ఎంపికైన అభ్యర్థుల ప్రకటన - 07.11.2024
దరఖాస్తుతో సమర్పించాల్సిన సర్టిఫికెట్లు
కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, మార్క్స్ మెమో, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ లేదా తత్సమానం, ప్రొవిజనల్/కాన్వొకేషన్ స్కాన్ చేసిన కాపీలు సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్ పై పాస్‌పోర్ట్ సైజు ఫొటో జోడించాలి.
సంబంధిత కథనం