తెలుగు న్యూస్ / ఫోటో /
Dasara 2024 : వరంగల్ రంగలీల మైదానంలో రావణ వధ.. ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా?
- Dasara 2024 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే విజయదశమి వేడుకలు.. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముఖ్యంగా వరంగల్ నగరంలో నిర్వహించిన రావణ వధ ఘనంగా జరిగింది. భారీగా తరలివచ్చిన ఓరుగల్లు వాసుల మధ్య వధ జరిగింది. వందేళ్లకు పైగా ఇక్కడ రావణ వధ జరుగుతోంది.

(1 / 5)
వరంగల్‌లోని రంగలీలా మైదానంలో రావణ వధ ఘనంగా నిర్వహించారు. రావణుడి భారీ దిష్టిబొమ్మను తయారి చేసి.. బాంబులతో పేల్చి బూడిద చేశారు. ఈ రావణ వధను చూసేందుకు 2 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చారని నిర్వాహకులు చెప్పారు.
(2 / 5)
100 ఏళ్లకు పైగా ఈ సంప్రదాయం వరంగల్‌లో కొనసాగుతోంది. 1920లలో రావణుడి పోస్టర్‌ను దహనం చేయడంతో మొదలైంది. స్వాతంత్య్రానంతరం బట్టలతో చేసిన దిష్టిబొమ్మను దహనం చేశారు.
(3 / 5)
10 తలల రావణుడి ప్రతిమను తయారుచేయడానికి రూ. 15 లక్షలకు పైగా ఖర్చయింది. రావణ దహనం సమయంలో అద్భుతమైన ప్రదర్శన జరిగేలా క్రాకర్స్ ఏర్పాటు చేశారు. నెల్లూరు నుండి నిపుణులను రప్పించి.. దిష్టిబొమ్మకు లోపల క్రాకర్స్‌ను చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేశారు.
(4 / 5)
ఈ వేడుకల్లో రావణ దహనం తోపాటు క్రాకర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రావడంతో.. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులను మోహరించారు.
ఇతర గ్యాలరీలు