TS EAPCET 2024 : విద్యార్థులకు అలర్ట్... తెలంగాణ ఎంసెట్, ఐసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు-telangana council of higher education has taken a decision rescheduling ts eapcet and icet exams 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eapcet 2024 : విద్యార్థులకు అలర్ట్... తెలంగాణ ఎంసెట్, ఐసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు

TS EAPCET 2024 : విద్యార్థులకు అలర్ట్... తెలంగాణ ఎంసెట్, ఐసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 22, 2024 06:49 PM IST

TS EAPCET and ICET 2024 Exam Updates: కీలకమైన ఎంసెట్(TS EAPCET) ప్రవేశ పరీక్షకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఐసెట్ షెడ్యూల్ లో కూడా మార్పులు చేసింది.

తెలంగాణలో ప్రవేశ పరీక్షలు
తెలంగాణలో ప్రవేశ పరీక్షలు

TS EAPCET and ICET 2024 Exam Updates: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… రాష్ట్రంలోని పలు పరీక్షలను రీషెడ్యూల్ చేస్తోంది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఇప్పటికే పాలీసెట్ పరీక్ష వాయిదా పడగా…. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్(TS EAPCET) పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. గత షెడ్యూల్ ప్రకారంతో పోల్చితే… మరింత ముందుగానే పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణ ఐసెట్ (TS ICET) షెడ్యూల్ కూడా మారింది.

గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. మే 9వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్షలు(TS EAPCET)) ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పరీక్షలు 12వ తేదీతో పూర్తి అవుతాయి. కానీ తెలంగాణలో మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల తేదీకి, పరీక్షల తేదీకి ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో…. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. మే 7వ తేదీ నుంచే పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు తేదీలను రీషెడ్యూల్ చేసింది. మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు జరగనున్నాయి. ఇక మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్‌ మోడ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఫలితంగా గత షెడ్యూల్ తో పోల్చితే ముందుగానే పరీక్షలు పూర్తి కానున్నాయి.

రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ఈఏపీ సెట్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీక‌రించ‌నున్నారు. ఏప్రిల్ 8 నుంచి 12 వరకు విద్యార్థులు ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. రిజిస్ట్రేష‌న్(TS EAPCET 2024 Registration) స‌మ‌యంలో ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థులు వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 14 లోపు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.2500తో ఏప్రిల్ 19 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మే 1 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇక గతంలో ఎంసెట్ గా ఉన్న పేరు TS EAPCETగా మారిన సంగతి తెలిసిందే.

TS EAPCET 2024 Dates: ముఖ్యమైన తేదీలు

  • ఫిబ్రవరి 21 - నోటిఫికేషన్ విడుదల
  • ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు-ఆన్ లైన్ అప్లికేషన్లు
  • ఏప్రిల్ 8 నుంచి 12 వరకు- ఎడిట్ ఆప్షన్
  • మే 1 నుంచి -హాల్ డికెట్లు డౌన్ లోడ్
  • మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్‌, ఫార్మసీ పరీక్షలు.
  • మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు

ఐసెట్ షెడ్యూల్ కూడా మార్పు….

TS ICET Exam 2024: మరోవైపు తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ కూడా మారింది. ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం…. జూన్ 4, 5 తేదీల్లో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జూన్ 4వ తేదీన లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. అదే రోజు ఎగ్జామ్ నిర్వహణ ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఉన్నత విద్యామండలి…. కొత్త తేదీలను ప్రకటించింది. జూన్ 5, 6 తేదీల్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ పరీక్షను(TS ICET Schedule 2024) నిర్వహిస్తారు. మార్చి 5న నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 7 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా…. ఏప్రిల్​ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసం రూ.250తో మే 17 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. రూ.500తో మే 27వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్​ 4, 5 తేదీల్లో ఐసెట్​ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది కూడా కాకతీయ వర్శిటీ పరీక్షను నిర్వహించనుంది.

TS ICET Schedule 2024: తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ :

తెలంగాణ ఐసెట్ 2024 నోటిఫికేషన్ - మార్చి 5,2024.

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - మార్చి 7 ,2024.

ఆలస్య రుసం లేకుండా ఏప్రిల్​ 30,2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆలస్య రుసం రూ.250తో దరఖాస్తు స్వీకరణ - మే 17,2024.

ఆలస్య రుసం రూ.500తో దరఖాస్తు స్వీకరణ- మే 27,2024.

పరీక్ష తేదీలు - జూన్​ 5, 5 -2024.

అధికారిక వెబ్ సైట్ - https://icet.tsche.ac.in

 

 

IPL_Entry_Point