TS Cabinet: మంత్రి వర్గంలోకి పట్నం మహేందర్ రెడ్డి.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం
TS Cabinet: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తెలంగాణ క్యాబినెట్‌లోకి కొత్త సభ్యుడు బాధ్యతలు చేపట్టనున్నారు. పట్నం మహేందర్ రెడ్డిని క్యాబినెట్‌లో తీసుకోవాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు.
TS Cabinet: తెలంగాణ మంత్రి వర్గంలోకి పట్నం మహేందర్ రెడ్డి చేరనున్నారు. బుధవారం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఈటల స్థానంలో ఖాళీగా ఉన్న పదవిలోకి పట్నం మహేందర్ రెడ్డిని తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. బుధవారం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో గురువారానికి ఈ కార్యక్రమంలో వాయిదా పడింది. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
గవర్నర్ సమక్షంలో జరిగే కార్యక్రమంలో పట్నం మంత్రి వర్గ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నారు. తాండూరు అసెంబ్లీ టిక్కెట్ వదులుకున్నందుకు పట్నం మహేందర్ రెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
మూడ్నెల్లలో అసెంబ్లీ గడువు ముగియనున్న సమయంలో పట్నం మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి వస్తే పట్నం మంత్రిగా కొనసాగిస్తారో లేదో చూడాల్సి ఉంది.
రంగారెడ్డి జిల్లా తాండూరులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పైలట్ రోహిత్ రెడ్డికి గెలిచారు. తాజా జాబితాలో బిఆర్‌ఎస్ టిక్కెట్ ఆయనకే దక్కింది. దీంతో పట్నం మహేందర్ రెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మరో మూడు నెలల పాటు మంత్రి పదవిలో కొనసాగనున్నారు. రంగారెడ్డి జిల్లాలో పార్టీకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పట్నంను మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.