TS Chicken Prices : మాంస ప్రియులకు షాక్ - భారీగా పెరిగిన చికెన్ ధరలు, ఆ తర్వాతే తగ్గే ఛాన్స్..!-kg skinless chicken prices reached rs 300 in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Chicken Prices : మాంస ప్రియులకు షాక్ - భారీగా పెరిగిన చికెన్ ధరలు, ఆ తర్వాతే తగ్గే ఛాన్స్..!

TS Chicken Prices : మాంస ప్రియులకు షాక్ - భారీగా పెరిగిన చికెన్ ధరలు, ఆ తర్వాతే తగ్గే ఛాన్స్..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 07, 2024 11:39 AM IST

Chicken Prices in Telangana: మండుతున్న వేసవిలో కోడి కూర ధరలు కూడా కొండెక్కాయి. ప్రస్తుతం రూ. 300 వరకు చేరాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

తెలంగాణలో పెరిగిన చికెన్ ధరలు
తెలంగాణలో పెరిగిన చికెన్ ధరలు (unsplash.com)

Chicken Prices in Telangana: చికెన్…. అంటే ఇష్టపడనివారంటూ ఉండరు. రకరకాల రిసెపీలను తయారు చేసుకొని…. తినేస్తుంటారు. అయితే గత కొంతకాలంగా చూస్తే…. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు(Chicken Rates in Telugu States) పెరుగుతూ వస్తున్నాయి. రెండు వారాల కిందట వరకు కిలో చికెన్ ధర రూ. 220లోపు ఉండగా… ఈ వారం అమాంతం పెరిగేసింది. అంతా ఇంతా కాదు… ఏకంగా రూ. 300కి వచ్చి చేరింది. షాపులకు వెళ్తున్న కొనుగోలుదారులు… ధరలను చూసి షాక్ అవుతున్నారు.

yearly horoscope entry point

కిలో రూ. 300..!

ఇవాళ తెలంగాణలో ధరలు చూస్తే…. స్కిల్ లెస్ కేజీ చికెన్ ధర(Chicken Prices) రూ. 300గా ఉంది. సరిగ్గా రెండు వారాల క్రితం చూస్తే… కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర రూ.200 నుంచి రూ.220 వరకు పలికింది. అలాగే స్కిన్ తో చికెన్ కిలో రూ.180 నుంచి రూ.200 మధ్య అమ్మకాలు జరిపారు. అయితే ఈ మధ్య కాలంలో క్రమంగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ధర రూ. 300కి చేరటంతో మాంస ప్రియులు షాక్ అవుతున్నారు. స్కిన్ తో అయితే….రూ. 270 నుంచి 280 మధ్య అమ్ముతున్నారు. పెరిగిన చికెన్ ధరలు చూసి చికెన్ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు.

కారణాలు ఇవే…!

ప్రస్తుతం చికెన్ ధరలు(Chicken Prices) పెరగటానికి గల కారణాలు చూస్తే… తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. మార్చి, ఏప్రిల్ మాసంలోనే… గరిష్ట్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎండ వేడిమితో ఫ్రౌల్టీలలోని కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ఉత్పత్తి తగ్గటంతో మార్కెట్ లో ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతూ వచ్చేసింది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారుల చెబుతున్నారు.

ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది…?

పెరిగిన ధరలపై హిందుస్తాన్ టైమ్స్ తెలుగు…. హైదరాబాద్ నగరంలో చికెన్ వ్యాపారం చేసే శ్రీనివాస్ తో మాట్లాడింది. “కొద్దిరోజులుగా ధరలు పెరుగుతూ వచ్చాయి. రెండు వారాల కిందట రూ. 250లోపు ఉండే. కానీ ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగటం ధరల పెరుగుదలకు కారణమైంది. ఇదే కాకుండా… రంజాన్ మాసం ఉండటం కూడా ఒక కారణం. హాలీమ్ తయారీ కోసం చికెన్ ను భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఓవైపు ఉత్పత్తి తగ్గి… మరోవైపు డిమాండ్ పెరగటంతో ధరలు భారీగా పెరిగాయి. రంజాన్ మాసం పూర్తి అయిన తర్వాత కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఎండలు మరింత ఎక్కువగా ఉంటే మాత్రం….ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది” అని ఆయన చెప్పారు.

Egg price today:కోడి గుడ్డు ధర

ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం హైదరాబాద్‌లో కోడి గుడ్డు ధర(Egg price Hyderabad Today) రూ.3.75గా ఉంది. హైదరాబాద్‌లో 100 కోడిగుడ్ల ధరరూ.375కాగా, ఒక ట్రే ధర రూ. 112.5గా ఉంది. ఏప్రిల్ 3వ తేదీ నాటి వరకు ఒక్క గుడ్డు ధర రూ. 3.80గా ఉంది.

Whats_app_banner