Medaram TSRTC: భక్తులకు షాక్… మేడారం బస్సుల్లో కోళ్లు , గొర్రెలకు ప్రవేశం లేదన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్…
Medaram TSRTC:మేడారం మొక్కుల కోసం ఆర్టీసీ బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలు తీసుకెళ్లే వారికి ఆర్టీసీ షాక్ ఇచ్చింది. బస్సుల్లో మూగజీవాల రవాణాకు అనుమతి లేదని తేల్చింది.
Medaram TSRTC:మేడారం మహాజాతర అంటేనే భక్తులు చాలామంది కోళ్లు, గొర్రెలు, మేకలతో అమ్మవార్లకు మొక్కుగా సమర్పించుకుంటుంటారు. మేడారం బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు live Stock entry ఎంట్రీ లేదని టీఎస్ ఆర్టీసీ TSRTCఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.
మూగజీవాలను ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లడం నిషేధమని, భక్తులు కూడా వాటిని బస్సుల్లో తీసుకురాకుండా సహకరించాలని సజ్జనార్ కోరారు. మేడారం జాతర నేపథ్యంలో వరంగల్ లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో Zonal training college ఆదివారం ఆర్టీసీ రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు, సిబ్బందితో మేడారం జాతర సన్నద్ధత సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై మేడారం జాతరకు ఆర్టీసీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించు కోవాలని కోరారు.
30 లక్షల మంది టార్గెట్
మేడారం జాతర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆయా బస్సులను రాష్ట్రంలోని 51 పాయింట్ల నుంచి ఆపరేట్ చేయనున్నట్లు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని, ఈసారి మొత్తంగా 30 లక్షల మంది భక్తులుdevotees ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
అందుకు తగ్గట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆపరేటింగ్ పాయింట్ల వద్ద ఆర్టీసీ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లతో పాటు తాత్కాలిక బస్టాండ్ల వద్ద తాగునీరు, టాయిలెట్ల సౌకర్యం కల్పించామన్నారు. భక్తుల
రద్దీని దృ ష్టిలో పెట్టుకు ని మేడారంలో 15 కిలోమీటర్ల మేర ఉండేలా 48 క్యూ లైన్లను కూడా ఏర్పా టు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ప్రమాదాలకు అవకాశం ఇవ్వొద్దు..
మేడారం బస్సులు నడిపే ఆర్టీసీ డ్రైవర్లు ఎట్టిపరిస్థితుల్లో ప్రమాదాలకు అవకాశం ఇవ్వవద్దని సజ్జనార్ సిబ్బందికి పిలుపునిచ్చారు. మేడారం మహా జాతరలో దాదాపు 15 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తు న్నా రని వారికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
జాతర విధులు నిర్వర్తించే బస్ డ్రైవర్లు జీరో ఫెయిల్యూర్స్ తో యాక్సిడెంట్ ఫ్రీ జాతర కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో విధు లు నిర్వర్తించాలన్నారు.
సంస్థకు మంచిపేరు తీసుకొచ్చేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ప్రయాణం పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. జాతర మార్గంలో ఎక్కడ విధులు కేటాయించిన సిబ్బంది, అక్కడ మాత్రమే విధులు నిర్వర్తించాలని సూచించారు.
మేడారం జాతరకు మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంటుందని, బస్సుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఒక ఛాలెంజ్ గా తీసుకుని సిబ్బంది విధులు నిర్వర్తించాలన్నారు. సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, వారికి వసతి సౌకర్యం, భోజన విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని ఆఫీసర్లకు చెప్పారు.
అందరూ సమష్టిగా మహాజాతరను సక్సెస్ గా పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఆ తరువాత మేడారం జాతరలో విధులు నిర్వర్తిం చే ఆర్టీసీ సిబ్బంది కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన టీ షర్ట్ లను సజ్జనార్ రిలీజ్ చేశారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)