Chicken Pox: పిల్లల్లో పెరిగిపోతున్న చికెన్ పాక్స్, వేసవిలో జాగ్రత్తగా ఉండాల్సిందే, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే
Chicken Pox: వేసవి వచ్చిందంటే చికెన్ పాక్స్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికే కేరళలో 7వేలకు పైగా చికెన్ పాక్స్ కేసులు బయటపడ్డాయి.
Chicken Pox: చికెన్ పాక్స్... దీన్ని గ్రామాల్లో అమ్మవారు అని కూడా పిలుస్తారు. ఒళ్లంతా ఎర్రని దద్దుర్లులా వస్తాయి. వేసవి వచ్చిందంటే చికెన్ ఫాక్స్ పిల్లల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కేరళలో చికెన్ పాక్స్ కారణంగా తొమ్మిది మంది మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ చెప్పింది. ఈ చికెన్ పాక్స్ వరిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది.
వేడి వాతావరణంలో...
ఎప్పుడైతే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయో... అప్పుడు ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక అంటూ వ్యాధి. చికెన్ పాక్స్ సోకిన వ్యక్తి తో పాటు జీవించే వారికి ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువ. అలాగే ఈ వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుంది. కాబట్టి చికెన్ పాక్స్ వచ్చిన వారికి పిల్లలను దూరంగా ఉంచడం చాలా మంచిది.
ఎవరికి వస్తుంది?
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో అమ్మవారు త్వరగా వస్తుంది. అందుకే పిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలకు చికెన్ పాక్స్ సోకితే కాస్త ప్రమాదం ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే అది పిండానికి కూడా హాని కలిగించే అవకాశం ఉంది. చికెన్ పాక్స్ కు సరైన సమయంలో చికిత్స అందకపోతే కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు.
చికెన్ పాక్స్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ ఆ వ్యాక్సిన్ వేయించుకోవాలి. చంటి పిల్లలకు కూడా చికెన్ పాక్స్ రాకుండా అడ్డుకునే వ్యాక్సిన్ వేయించడం చాలా ముఖ్యం.
చికెన్ పాక్స్ లక్షణాలు
ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తాయి. తీవ్ర అలసట అనిపిస్తుంది. ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది. చర్మంపై ఎరుపు దద్దుర్లు, బొబ్బలు వంటివి కనిపిస్తాయి. ఇవి మొదటగా ముఖంపై, నోటిపై కనిపిస్తాయి. తర్వాత ఛాతీ ఇతర శరీర భాగాలకు సోకుతాయి. ఇలా ఎర్రటి దద్దుర్లు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా మంచిది.
చికెన్ పాక్స్ కు చికిత్స
చికెన్ పాక్స్ సోకిన వ్యక్తిని శుభ్రమైన గాలి, వెలుతురు అధికంగా తగిలే గదిలో ఉంచాలి. కొందరికి పెద్ద పెద్ద బొబ్బలు వస్తాయి. అవి చీము పట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అది పగిలిపోతే ఆయింట్మెంట్ వంటివి రాస్తూ ఉండాలి. తుమ్ము , దగ్గు వచ్చినప్పుడు నోరు, ముక్కును కప్పుకోండి. దీనివల్ల అది గాలి ద్వారా ఇతరులకు సోకకుండా ఉంటుంది. ముఖ్యంగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. స్వీయ చికిత్సలు మానేసి వైద్యులు సూచించిన వందులను తప్పకుండా వాడాలి. ఇలా చేస్తే చికెన్ పాక్స్ ప్రమాదకరంగా మారకుండా త్వరగా పోతుంది.
టాపిక్