IRCTC Hyd Karnataka Tour: హైదరాబాద్ - మురుడేశ్వర్ ట్రిప్… ఈ ప్యాకేజీ చూడండి-irctc tourism announced murudeshwar tour from hyderabad city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Hyd Karnataka Tour: హైదరాబాద్ - మురుడేశ్వర్ ట్రిప్… ఈ ప్యాకేజీ చూడండి

IRCTC Hyd Karnataka Tour: హైదరాబాద్ - మురుడేశ్వర్ ట్రిప్… ఈ ప్యాకేజీ చూడండి

HT Telugu Desk HT Telugu
Dec 08, 2022 01:48 PM IST

Hyderabad To Coastal Karnataka Tour : హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. దీనికి సంబంధించిన వివరాలను పేర్కొంది.

హైదరాబాద్  - మురుడేశ్వర్  టూర్
హైదరాబాద్ - మురుడేశ్వర్ టూర్ (irctc)

IRCTC Coastal Karnataka Tour From Hyderabad : పలు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. పర్యాటక ప్రాంతాలే కాకుండా అధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో పలు పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. ఉడిపి, శృంగేరి, మురుడేశ్వర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ డిసెంబర్ 13, 2022 తేదీన అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 1: మెుదటిరోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 రైలు(acheguda - Mangalore Central Express) బయల్దేరుతుంది.

Day 2: రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఉడిపికి చేరుకుంటారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత శ్రీకృష్ణ ఆలయం, సెయింట్ మేరీ ఐల్యాండ్, మల్పే బీచ్ సందర్శిస్తారు. రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు.

Day 3 : మూడో రోజు ఉడిపి నుంచి శృంగేరికి బయల్దేరుతారు. శారదంబ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం కొల్లూరు, ముకాంబికా ఆలయాలకు వెళ్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు చేరుకుంటారు.

Day 4: నాలుగో రోజు ఉదయమే ఆలయ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి జోగ్ వాటర్ ఫాల్స్ కు వెళ్తారు. మధ్యాహ్నం గోకర్నా సందర్శన తర్వాత... తిరిగి మురుదేశ్వర్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

Day 5 : ఐదో రోజు మంగళూరుకు చేరుకుంటారు. కటీల్, మంగలా ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి 7 గంటల వరకు మంగళూరు సెంట్రల్ కు చేరుకొని హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారు.

Day 6 : ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ ముగుస్తుంది.

ధరల వివరాలు
ధరల వివరాలు (www.irctctourism.com)

ధరల వివరాలు

ఈ టూర్ కు సంబంధించి కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు 34,270 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19570 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 15,480గా ఉంది. ఇక స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే సింగిల్ షేరింగ్ కు రూ. 31, 270, డబుల్ షేరింగ్ కు రూ. 16,570, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 12,480 ధరగా నిర్ణయించారు. చిన్న పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.

NOTE:

మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Whats_app_banner