IRCTC Thailand Tour : థాయ్ లాండ్ లో 4 రోజులు - బడ్డెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలివే-irctc tourism 4 days thailand tour package from hyderabad 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Thailand Tour : థాయ్ లాండ్ లో 4 రోజులు - బడ్డెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలివే

IRCTC Thailand Tour : థాయ్ లాండ్ లో 4 రోజులు - బడ్డెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 05, 2024 06:17 PM IST

IRCTC Hyderabad Thailand Tour : హైదరాబాద్ నుంచి థాయ్లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. ఇందులో భాగంగా 4 రోజుల పాటు పర్యటిస్తారు. బ్యాంకాక్, పట్టాయా వంటి టూరిజం స్పాట్ లను చూస్తారు. మరిన్ని వివరాలను ఈ కథనంలో చూడండి….

హైదరాబాద్ - థాయ్ లాండ్ టూర్
హైదరాబాద్ - థాయ్ లాండ్ టూర్ (Photo Source From https://unsplash.com/)

IRCTC Hyderabad Thailand Tour Package : థాయ్ లాండ్ కు వెళ్లి రిలాక్స్ అయ్యే ప్లాన్ ఉందా..? ఇందుకోసం తక్కువ బడ్జెట్ లో అందించే టూరిజం ప్యాకేజీల కోసం చూస్తున్నారా..? అయితే మీలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ టూరిజం(Irctc Tourism) అనేక రకాల ప్యాకేజీలను తీసుకువస్తోంది. ఇందులో కొన్ని అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. అధ్యాత్మిక ప్రాంతాలతో పాటు మంచి సేద తీరే ప్రాంతాలకు కూడా ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా…. హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ కు సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి….

హైదరాబాద్ - థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ వివరాలు:

  • హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ కు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది ఐఆర్‌సీటీసీ టూరిజం.
  • ‘TREASURES OF THAILAND EX HYDERABAD’ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
  • ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే 4 రోజుల పాటు థాయ్ లాండ్ లో పర్యటిస్తారు.
  • ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం మే 09, 2024 తేదీన అందుబాటులో ఉంది.

షెడ్యూల్ :

Day 01: థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీని(Thailand Tour Package) ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. తొలి రోజు రాత్రి 09 గంటలకు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాల్సి ఉంటుంది. ముందుగా పట్టాయాకు చేరుకుంటారు. పలు పర్యాటక ప్రాంతాలను చూస్తారు. రాత్రికి పట్టాయాలోనే ఉంటారు.

Day 02:రెండో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…ఇండియన్ లాంచ్ లో ఐల్యాండ్ కు వెళ్తారు.ఆ తర్వాత నాంగ్ నుచ్ ట్రాఫికల్ గార్డెన్ కు వెళ్తారు. ఇండియన్ రెస్టారెంట్ లో భోజనం ఉంటుంది. రాత్రి కూడా పట్టాయాలోనే బస ఉంటుంది.

Day 03:మూడో రోజు పట్టాయాలోనే సఫారీకి వెళ్తారు.మెరైన్ పార్క్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత బ్యాంకాక్ కు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న పలు ప్రాంతాలను చూస్తారు.

Day 04: 4వ రోజు బ్యాంకాక్ సిటీలోని పలు ప్రాంతాలను చూస్తారు. పలు ఆలయాలను కూడా సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు బ్యాంకాక్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు.

IRCTC Hyderabad Thailand Tour Prices: హైదరాబాద్ - థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ(Thailand Tour Package)ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 57415గా ఉంది. డబుల్ షేరింగ్ కు 49040గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 49040గా ప్రకటించారు. 5- 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. www.irctctourism.com క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే… 040-27702407 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

IPL_Entry_Point