IRCTC : యూజర్లకు ఐఆర్‌సీటీసీ హెచ్చరిక.. వాటిని వాడొద్దంటూ జాగ్రత్తలు-irctc issued warning to for android users about fake app fake website ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Irctc Issued Warning To For Android Users About Fake App Fake Website

IRCTC : యూజర్లకు ఐఆర్‌సీటీసీ హెచ్చరిక.. వాటిని వాడొద్దంటూ జాగ్రత్తలు

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 17, 2023 08:10 PM IST

IRCTC Warning: యూజర్లకు ఐఆర్‌సీటీసీ హెచ్చరిక జారీ చేసింది. నకిలీ యాప్, వెబ్‍సైట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని వివరాలు వెల్లడించింది.

IRCTC : రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ హెచ్చరిక.. వాటిని వాడొద్దంటూ జాగ్రత్తలు (HT Photo)
IRCTC : రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ హెచ్చరిక.. వాటిని వాడొద్దంటూ జాగ్రత్తలు (HT Photo)

IRCTC Warning: ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరస్థులు రకరకాల దారులు వెతుకుతుంటారు. డబ్బుతో పాటు సమాచారాన్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ విధంగానే ఐఆర్‌సీటీసీ ఫేక్ యాప్, వెబ్‍సైట్‍ను క్రియేట్ చేసి కొందరు సైబర్ నేరగాళ్లు స్కామ్‍లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కామ్‍ల నుంచి ప్రయాణికులను కాపాడేందుకు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజమ్ కార్పొరేషన్ (IRCTC) హెచ్చరికలు జారీ చేసింది. ఐఆర్‌సీటీసీ ఫేక్ యాప్, ఫేక్ వెబ్‍సైట్ వాడొద్దని జాగ్రత్తలు చెప్పింది. అధికారిక యాప్‍, వెబ్‍సైట్‍ను మాత్రమే వాడాలని వెల్లడించింది. ఐఆర్‌సీటీసీ ఫేక్ యాప్ పేరు “irctcconnect.apk” అని ఉంటుందని పేర్కొంది. ఫేక్ వెబ్‍సైట్ “https://irctc.creditmobile.site” అడ్రస్‍తో ఉంటుందని వెల్లడించింది. ఇలాంటి నకిలీవి ఉపయోగించి మోసపోవద్దని యూజర్లను హెచ్చరించింది. ఐఆర్‌సీటీసీ అధికారిక యాప్, వెబ్‍సైట్‍ ద్వారా మాత్రమే రైలు టికెట్లు సహా ఇతర బుకింగ్స్ చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

‘డేటా’ ప్రమాదం

IRCTC Warning: ఐఆర్‌సీటీసీ ఫేక్ యాప్ “irctcconnect.apk”ను ఆండ్రాయిడ్ ఫోన్‍లో డౌన్‍లోడ్ చేసుకొని వాడితే యూజర్ల డేటా సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐఆర్‌సీటీసీ పేర్కొంది. https://irctc.creditmobile.site ఫిషింగ్ వెబ్‍సైట్‍ను యూజర్లు వాడకూడదని హెచ్చరించింది. ఈ వెబ్‍సైట్ చూడడానికి ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‍సైట్‍లా ఉంటుందని, ఒకవేళ అది ఒరిజినల్ అని నమ్మి వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేస్తే.. స్కామర్ల చేతికి వెళ్లినట్టేనని పేర్కొంది. యూజర్ల లాగిన్ వివరాలను స్కామర్లు చేజిక్కించుకొని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. నకిలీ వెబ్‍సైట్ అడ్రస్ వాట్సాప్, టెలిగ్రామ్ మెసేజ్‍ల్లో చక్కర్లు కొడుతోందని, జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

ప్రజల నెట్‍బ్యాంకింగ్, యూపీఐ, బ్యాంక్ కార్డుల వివరాలను కొల్లగొట్టేందుకు స్కామర్లు ఇలా ఫేక్ యాప్‍లు, వెబ్‍సైట్‍లను తయారు చేస్తున్నారని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.

సేఫ్‍గా ఉండడం ఎలా…!

రైలు టికెట్లతో పాటు ఐఆర్‌సీటీసీ అందించే సేవలను బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ అధికారిక యాప్, వెబ్‍సైట్‍ను మాత్రమే ఉపయోగిస్తే సేఫ్‍గా ఉండొచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లయితే ఐఆర్‌సీటీసీ యాప్‍ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‍లోడ్ చేసుకోవాలి. ఇతర వెబ్‍సైట్ల నుంచి ఇన్‍స్టాల్ చేసుకోకూడదు. అలాగే ఓటీపీ, బ్యాంకు కార్డు వివరాలు, యూపీఐ లాంటి వివరాలను ఫోన్ ద్వారా ఇతరులు ఎవరికీ చెప్పకూడదని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

WhatsApp channel