Ind vs Aus T20 In Hyd : టీ-20 మ్యాచ్ టికెట్ కాస్ట్ ఎంత, ఎలా కొనుక్కోవాలి?-india vs australia t20i match in hyderabad tickets price and how to buy know in details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ind Vs Aus T20 In Hyd : టీ-20 మ్యాచ్ టికెట్ కాస్ట్ ఎంత, ఎలా కొనుక్కోవాలి?

Ind vs Aus T20 In Hyd : టీ-20 మ్యాచ్ టికెట్ కాస్ట్ ఎంత, ఎలా కొనుక్కోవాలి?

Anand Sai HT Telugu
Sep 14, 2022 09:26 PM IST

Cricket Match In Hyderabad : క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చింది. హైదరాబాద్ లో చాలా రోజుల తర్వాత టీమ్ ఇండియా మ్యాచ్ ఆడనుంది. మరి ఈ మ్యాచ్ చూడాలి అనుకునేవారు టికెట్ ఎలా కొనుక్కోవాలి? ఎంత కాస్ట్ ఉంటుంది?

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం

IND vs AUS Hyderabad 2022 : రెండేళ్ల విరామం తర్వాత, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 20 నుంచి భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. మూడో టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 25న (ఆదివారం) హైదరాబాద్‌లో జరగనుంది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మ్యాచ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మూడో టీ-20 మ్యాచ్ టిక్కెట్లు Paytm ఇన్‌సైడర్ యాప్‌లో గురువారం అంటే సెప్టెంబర్ 15 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. టిక్కెట్లను స్టేడియం కౌంటర్లలో ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. మ్యాచ్ రోజున గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

దాదాపు 4 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో టీ 20 క్రికెట్ ఆడేందుకు టీమ్ ఇండియా రెడీ అయ్యింది. డిసెంబరు 6, 2019న వెస్టిండీస్‌తో చివరిగా ఆడిన T20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడించింది భారత్. కేఎల్ రాహుల్ 62, విరాట్ కోహ్లీ 94 పరుగుల ఆధిక్యంతో భారత్ 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరును ఛేదించింది. ఈసారి సెప్టెంబరు 25న జరిగే మూడో టీ20లో ఆస్ట్రేలియాతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ తలపడనుంది.

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం 55,000 మంది సామర్థ్యంతో నగరంలోని ప్రధాన క్రికెట్ స్టేడియం. ఇది అత్యాధునిక సదుపాయాలతో ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మ్యాచ్‌లతో పాటు అనేక అంతర్జాతీయ ఆటలు ఇక్కడ జరిగాయి. ఇప్పుడు టీమ్ ఇండియా-ఆస్ట్రేలియా టీ 20 కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్ 25న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం ఆన్‌లైన్ టిక్కెట్ల విక్రయం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ చెప్పిన ప్రకారం, టిక్కెట్లు Paytm యాప్, Paytm ఇన్సైడర్ యాప్‌లో విక్రయిస్తారు. టిక్కెట్ ధర రూ.10,000 నుండి రూ.300 వరకు ఉంటుంది.

టీమ్ ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షాల్ , జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్

Whats_app_banner