Hyderabad Traffic Diversions : హైదరాబాద్ వాసులకు అలర్ట్, రేపు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Traffic Diversions : రంజాన్ వేడుకల సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో ప్రార్థనలు కారణంగా వాహనాలను దారిమళ్లించారు.
Hyderabad Traffic Diversions : హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) కీలక సూచన చేశారు. రేపు(ఏప్రిల్ 11న) రంజాన్ (Ramadan)పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Diversions) అమల్లో ఉంటాయని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మీర్ ఆలం ఈద్గా, మాసబ్ ట్యాంక్ పరిధిలోని హాకీ గ్రౌండ్స్ లో ఈదుల్ పితర్ ప్రార్థన ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మీర్ ఆలం ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో వాహనాల రాకపోకలను ఏ మాత్రం అనుమతించరు.
ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా వాహనదారులు(Vehicle Diversions) బహదూర్ పూర చౌరస్తా వద్ద కిషన్ బాగ్, కామాటి పురా, పురానా పుల్ వైపు వెళ్లవచ్చు. ఇక ఈద్గా వైపు వెళ్లే వాహనాలను శాస్త్రిపురం, ఎన్ ఎస్ కుంట తదితర ప్రాంతాల వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తారు. ఇక కాలపత్తార్ వద్ద మోచీ కాలనీ, బహదూర్ పురా, శంషీర్ గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు వాహనాలను మళ్లిస్తారు. అదే విధంగా పురాన పూల్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను జియగూడ వైపు, రాజేంద్ర నగర్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే భారీ వాహనాలను ఆరంఘర్ జంక్షన్ వద్ద లేదా శంషాబాద్, రాజేంద్రనగర్ , మైలర్ దేవ్ పల్లి వైపు భారీ వాహనాలను మళ్లిస్తారు.
మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింద రాకపోకలు బంద్
హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ జంక్షన్(Masab Tank) ఫ్లైఓవర్ కింద కూడా రంజాన్ సందర్భంగా ప్రార్థనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫ్లైఓవర్ కింద వాహనాల రాకపోకలను అనుమతించరు. రేపు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మెహదీపట్నం, లక్డీకపూల్ వైపు నుంచి ఫ్లై ఓవర్ పై మాత్రమే రాకపోకలు సాగించవచ్చు. బంజారాహిల్స్ రోడ్ నంబర్.12 నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వచ్చే వాహనాలను రోడ్ నెంబర్12 జంక్షన్ నుంచి తాజ్ కృష్ణ హోటల్, ఆర్టీఏ ఖైరతాబాద్ వైపు మళ్లిస్తారు. అదే విధంగా పంజాగుట్ట నుంచి తాజ్ కృష్ణ హోటల్..ఎర్రం మంజిల్ కాలనీ, ఆర్టీఏ ఖైరతాబాద్, నిరంకారి భవన్, లక్డీకపూల్, మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్, మెహాదీపట్నం వైపు వాహనాలను (Traffic Diversions)మళ్లించనున్నారు. ప్రజలు,వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసు కోరారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా