Ramadan 2024 Telugu Wishes: ఈద్ ముబారక్.. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు ఇలా అందంగా చెప్పండి
Ramadan 2024 Telugu Wishes: ముస్లిం సోదరులకు అతి పెద్ద పండుగ రంజాన్. దీన్ని ఈద్, ఈద్-ఉల్-ఫితర్ అని కూడా అంటారు. పండుగ నిర్వహించుకుంటున్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు ఇలా చెప్పండి.
Ramadan 2024 Telugu Wishes: ముస్లిం సోదరులకు పవిత్ర మాసం రంజాన్. రంజాన్ మాసం ముగింపు దశకు వచ్చేసింది. చివరి రోజున ఈద్-ఉల్-ఫితర్ పండుగను నిర్వహించుకుంటారు. దీన్ని ఈద్ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు ఈ పవిత్ర పండుగను నిర్వహించుకుంటారు. ఆరోజు పవిత్ర ఖురాన్ ను చదువుతూ, ప్రార్థనలు చేస్తారు. ఈద్-ఉల్-ఫితర్ పండుగ పవిత్ర రంజాన్ మాసం ముగింపు దశకు వచ్చిందని సూచిస్తుంది. రంజాన్ మాసంలో చేసిన కఠిన ఉపవాస దీక్షలకు ఈద్-ఉల్-ఫితర్ పండుగతో ముగింపు వచ్చేస్తుంది.
ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఒమన్, టర్కీ, ఈజిప్ట్, బహ్రెయిన్ వంటి దేశాల్లో ఏప్రిల్ 10నే నిర్వహించుకుంటారు. మనదేశంలో మాత్రం ఏప్రిల్ 11 ఈద్-ఉల్-ఫితర్ పండుగ చేసుకుంటున్నారు. ఈద్ చంద్రుడు కనిపిస్తేనే ఈ పండుగను నిర్వహించుకుంటారు. మన దేశంలో ఏప్రిల్ 11న చంద్రుడు కనిపించే అవకాశం ఉంది.
ఈద్ శుభాకాంక్షలు
రంజాన్ శుభాకాంక్షలను ప్రతి ముస్లిం సోదరునికి అందంగా తెలియజేయండి. వారు ఆ పండుగను మరింత ఆనందంగా నిర్వహించుకునేలా చేయండి. ఇక్కడ మేము కొన్ని రంజాన్ శుభాకాంక్షలు ఇచ్చాము .