AP TG Rains : ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ-hyderabad ap tg rains forecast weather updates moderate to heavy rains yellow alert to some districts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ap Tg Rains : ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

AP TG Rains : ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Bandaru Satyaprasad HT Telugu
Jul 09, 2024 09:57 PM IST

AP TG Rains : ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

AP TG Rains : ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరకోస్తా తీరం మీదుగా విస్తరించిన ఆవర్తనం ప్రభావంతో రేపు(బుధవారం) ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరో మూడు రోజులు వర్షాలు

కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావణ కేంద్రం ప్రకటించింది. అలాగే పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీస్తాయని తెలిపింది.

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని సగటు సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, ములుగు, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నిజామాబాద్, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం