(1 / 7)
ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించటంతో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మరికొద్దిరోజులు కూడా వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.
(Image Source @APSDMA Twitter)(2 / 7)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణకోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
(3 / 7)
ఏపీలో ఇవాళ(జూన్ 07) విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(4 / 7)
అంతేకాకుండా నేడు శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(5 / 7)
ఇక తెలంగాణలో చూస్తే మూడు నాలుగు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(6 / 7)
తెలంగాణలో ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా... ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(7 / 7)
తెలంగాణలోని జిల్లాల్లో జులై 11వ తేదీ వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇతర గ్యాలరీలు