Who is Suyash Sharma: తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ పని పట్టిన సుయశ్ శర్మ ఎవరో తెలుసా? షారుక్ ముందే మై హూ నా అంటూ..
Who is Suyash Sharma: తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ పని పట్టిన సుయశ్ శర్మ ఎవరో తెలుసా? షారుక్ ఖాన్ ముందే మై హూ నా అంటూ అతడు సెలబ్రేట్ చేసుకున్న వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.
Who is Suyash Sharma: ఐపీఎల్ ఇప్పటికే ఇండియాలోని ఎంతో మంది ఆణిముత్యాలను వెలికి తీసింది. ఇండియన్ క్రికెట్ లో ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న రవీంద్ర జడేజా కూడా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్లేయరే. తాజాగా ఐపీఎల్ 2023లోనూ అలాంటి ఓ ప్లేయర్ అందరి దృష్టిలో పడ్డాడు. అతని సుయశ్ శర్మ. తాను ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్ లోనే ఆర్సీబీ పని పట్టాడు.
ఏకంగా మూడు వికెట్లతో చెలరేగాడు. దినేష్ కార్తీక్, అనూజ్ రావత్, కర్ణ్ శర్మల వికెట్లను అతడు తీయడం విశేషం. విచిత్రమైన బౌలింగ్ స్టైల్ తో ఆకట్టుకున్న సుయశ్.. తొలి వికెట్ తీసిన తర్వాత మై హూ నా అంటూ సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా మందిని ఆకర్షించింది. ఆ సమయంలో కేకేఆర్ బాస్, ఈ మై హూ నా సినిమా హీరో షారుక్ ఖాన్ స్టేడియంలోనే ఉన్నాడు.
ఎవరీ సుయశ్ శర్మ?
సుయశ్ శర్మ ఢిల్లీకి చెందిన ప్లేయర్. అతన్ని గతేడాది మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. నిజానికి అతడు ఆర్సీబీతో మ్యాచ్ లో అసలు తుది జట్టులోనే లేడు. కేకేఆర్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వెంకటేశ్ అయ్యర్ ను పక్కన పెట్టి ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయశ్ ను తీసుకొచ్చాడు. ఆ ఎత్తుగడ ఫలించింది.
ప్రస్తుతం ఢిల్లీ అండర్-25 టీమ్ కు ఆడుతున్న సుయశ్.. ఇప్పటి వరకూ ఒక్క లిస్ట్ ఎ, ఫస్ట్ క్లాస్, టీ20 మ్యాచ్ ఆడలేదు. అలాంటి బౌలర్ కు నేరుగా ఐపీఎల్ మ్యాచ్ లో ఆడే అవకాశం ఇచ్చింది కోల్‌కతా నైట్ రైడర్స్. అప్పటికే నరైన్, వరుణ్ చక్రవర్తి రూపంలో ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు జట్టులో ఉండగా.. సుయశ్ ను కూడా ఆడించి తాము ఆశించిన ఫలితాన్ని రాబట్టింది.
ఈ ముగ్గురు స్పిన్నర్లు కలిసి ఆర్సీబీ పని పట్టారు. సుయశ్ కు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని, అతడు బౌలింగ్ చేసిన తీరు చూసి చాలా ఆనందం వేసిందని కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా మ్యాచ్ తర్వాత అన్నాడు.
సంబంధిత కథనం