Shubman Gill: క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ శుభ్‌మన్ గిల్.. ఆ రికార్డేంటో తెలుసా?
Shubman Gill: క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఇంతకీ ఆ రికార్డేంటో తెలుసా? సన్ రైజర్స్ తో మ్యాచ్ లో సెంచరీ ద్వారా గిల్ ఈ ఘనత సాధించాడు.
Shubman Gill: టీమిండియా, గుజరాత్ టైటన్స్ స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది ఐపీఎల్లో టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో దూసుకెళ్తున్నాడు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో తన ఐపీఎల్ కెరీర్లోనే తొలి సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ ద్వారా గిల్ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డు అందుకోవడం విశేషం.
ఎస్ఆర్‌హెచ్ తో మ్యాచ్ లో గిల్ 58 బంతుల్లోనే 101 రన్స్ చేసిన విషయం తెలిసిందే. దీనిద్వారా క్రికెట్ చరిత్రలో ఒకే కేలండర్ ఇయర్ లో టెస్టులు, వన్డేలు, టీ20లు, ఐపీఎల్లో సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ గా గిల్ నిలిచాడు. ఈ ఏడాది మొదట్లో అతడు న్యూజిలాండ్ పై వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత అదే న్యూజిలాండ్ పై అహ్మదాబాద్ లో తొలి టీ20 సెంచరీ అందుకున్నాడు.
ఇక మరోసారి నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఆస్ట్రేలియాపై టెస్టుల్లో సెంచరీ చేశాడు. ఇప్పుడదే గ్రౌండ్ లో సన్ రైజర్స్ పై ఐపీఎల్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ నాలుగు సెంచరీలు జనవరి నుంచి మే 15లోపే నమోదు కావడం విశేషం. ప్రస్తుత ఐపీఎల్లో గిల్ 13 మ్యాచ్ లలో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతోపాటు మొత్తం 576 రన్స్ చేశాడు.
ఈ ఏడాది కూడా ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటన్స్ నిలవడంలో శుభ్‌మన్ గిల్ తనదైన పాత్ర పోషించాడు. ఏకంగా 48 సగటుతో పరుగులు చేస్తుండటంతో జీటీ టీమ్ వరుసగా రెండో టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది. జీటీ తరఫున సెంచరీ చేసిన, ఐపీఎల్లో 1000 పరుగులు అందుకున్న తొలి ప్లేయర్ కూడా గిల్ కావడం విశేషం.
సంబంధిత కథనం