World Cup Schedule: హైదరాబాద్‌లో పాకిస్థాన్ మ్యాచ్‌లు.. వరల్డ్ కప్‌లో ఇండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో..!-world cup schedule may be released after ipl 2023 as india may play with australia in their first match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  World Cup Schedule May Be Released After Ipl 2023 As India May Play With Australia In Their First Match

World Cup Schedule: హైదరాబాద్‌లో పాకిస్థాన్ మ్యాచ్‌లు.. వరల్డ్ కప్‌లో ఇండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో..!

Hari Prasad S HT Telugu
May 10, 2023 05:21 PM IST

World Cup Schedule: వరల్డ్ కప్‌లో ఇండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్ అక్టోబర్ 15న జరిగే అవకాశం ఉన్నట్లు క్రిక్‌బజ్ రిపోర్టు వెల్లడించింది.

ఆస్ట్రేలియాతో ఇండియా తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడే అవకాశం
ఆస్ట్రేలియాతో ఇండియా తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడే అవకాశం (PTI)

World Cup Schedule: వరల్డ్ కప్‌లో భాగంగా హైదరాబాద్ లోనూ పాకిస్థాన్ టీమ్ మ్యాచ్ లు ఆడనుంది. వరల్డ్ కప్ అధికారిక షెడ్యూల్ ఇంకా వెలువడాల్సి ఉంది. ఐపీఎల్ తర్వాత బీసీసీఐ ఈ షెడ్యూల్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ వరల్డ్ కప్ లో ఇండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడే అవకాశం ఉన్నట్లు క్రిక్‌బజ్ రిపోర్ట్ వెల్లడించింది. మెన్స్ వన్డే వరల్డ్ కప్ ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి ఇండియాలో ప్రారంభం కానుంది.

ట్రెండింగ్ వార్తలు

ఇక దాయాది పాకిస్థాన్ తో మ్యాచ్ అక్టోబర్ 15న జరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఈ రిపోర్టు తెలిపింది. ఇక టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించి అధికారిక షెడ్యూల్ ను బీసీసీఐ త్వరలోనే రిలీజ్ చేయనుంది. ఇక ఫైనల్ నవంబర్ 19న అహ్మదాబాద్ లోనే జరిగే ఛాన్స్ ఉంది.

వరల్డ్ కప్ లో ఆడటానికి పాకిస్థాన్ అంగీకరించినట్లు కూడా బోర్డు వర్గాలు చెప్పినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. అయితే ఇండియాతో మ్యాచ్ ను అహ్మదాబాద్ లో నిర్వహించడంపైనే పాక్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ రిపోర్టు ప్రకారం పాకిస్థాన్ తన మ్యాచ్ లను హైదరాబాద్ తోపాటు అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరులలో ఆడనుంది.

అందులోనూ చెన్నైలో పాక్ తన మెజార్టీ మ్యాచ్ లు ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా కోల్‌కతా, ఢిల్లీ, ఇండోర్, ధర్మశాల, గువాహటి, రాజ్‌కోట్, రాయ్‌పూర్, ముంబైలలోనూ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రతి టీమ్ 9 లీగ్ మ్యాచ్ లు ఆడనుండటంతో.. దాదాపు ప్రతి సిటీలో ఇండియా మ్యాచ్ లు ఉండనున్నాయి. వరల్డ్ కప్ లో మొత్తం 10 జట్లు ఆడనుండగా.. 48 మ్యాచ్ లు జరుగుతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం