Moody on Kohli vs Gill: గిల్ 8 సిక్స్‌లు కొడితే.. కోహ్లి ఒక్కటే కొట్టాడు.. అదే తేడా: టామ్ మూడీ
Moody on Kohli vs Gill: గిల్ 8 సిక్స్‌లు కొడితే.. కోహ్లి ఒక్కటే కొట్టాడు.. అదే తేడా అంటూ ఇద్దరి సెంచరీలను పోల్చి చూశాడు టామ్ మూడీ. కోహ్లి సెంచరీని వెనక్కి నెడుతూ.. గిల్ తన కళ్లు చెదిరే సెంచరీతో గుజరాత్ టైటన్స్ ను గెలిపించిన విషయం తెలిసిందే.
Moody on Kohli vs Gill: విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ సెంచరీల్లో ఎవరిది గొప్ప? కోహ్లి ఫైటింగ్ ఇన్నింగ్స్ తో ఆర్సీబీకి భారీ స్కోరు అందిస్తే.. గిల్ తన కళ్లు చెదిరే సెంచరీతో గుజరాత్ టైటన్స్ ను గెలిపించాడు. దీంతో సహజంగానే కోహ్లి సెంచరీ మరుగున పడిపోయింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూవీ ఇద్దరి సెంచరీల్లోని మరో తేడాను కూడా వెల్లడించాడు.
గిల్ తన ఇన్నింగ్స్ లో 8 సిక్స్ లు బాదితే.. కోహ్లి ఒక్కటే కొట్టాడని, గిల్ చేజింగ్ లోనూ 200 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించడం నిజంగా గొప్ప విషయమని మూడీ అన్నాడు. కోహ్లి తన గురువు అంటూనే గురువును మించిన ఇన్నింగ్స్ తో గిల్ అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్ తో అతని రేంజ్ మరో లెవల్ కు చేరింది. ఈ నేపథ్యంలో ఇద్దరి సెంచరీలను పోలుస్తూ మూడీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
"అతని ఇన్నింగ్స్ చూడముచ్చటగా ఉంది. క్రీజులో ఎంతో సహనంగా ఉన్నాడు. అతని ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్ ఎంతో నియంత్రణలో ఉన్నాయి. 8 సిక్స్‌లు. రెండు సెంచరీల్లో ఇదే ప్రధాన తేడా. రెండూ అద్భుతమైన సెంచరీలే. కానీ కోహ్లి కేవలం ఒకే ఒక్క సిక్స్ కొట్టాడు. గిల్ ఎనిమిది బాదాడు. 200 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. అదే పెద్ద తేడా. అందులోనూ చేజింగ్ లో రావడం చూస్తే అతనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే" అని మూడీ అన్నాడు.
కోహ్లి 62 బంతుల్లో సెంచరీ చేయగా.. గిల్ 52 బంతుల్లో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఏడాది తన పరుగుల్లో చాలా వరకూ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే చేసిన గిల్.. తొలిసారి బయట కూడా సెంచరీతో మెరిశాడు. ఈ సీజన్ లో రెండేసి సెంచరీలు చేసిన బ్యాటర్లు కూడా ఈ ఇద్దరే. విరాట్ వరుసగా రెండు సెంచరీలు చేసినా.. ఆర్సీబీ మాత్రం ప్లేఆఫ్స్ చేరలేకపోయింది.
సంబంధిత కథనం