Kohli fans trolled Naveen: విరాట్ సెంచరీ తర్వాత నవీనుల్, గంభీర్‌తో ఆడుకున్న అభిమానులు.. మీమ్స్ జాతర-kohli fans trolled naveen and gamhir after their idol made 6th ipl century ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Kohli Fans Trolled Naveen And Gamhir After Their Idol Made 6th Ipl Century

Kohli fans trolled Naveen: విరాట్ సెంచరీ తర్వాత నవీనుల్, గంభీర్‌తో ఆడుకున్న అభిమానులు.. మీమ్స్ జాతర

గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, నవీనుల్ హక్
గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, నవీనుల్ హక్ (PTI)

Kohli fans trolled Naveen: విరాట్ సెంచరీ తర్వాత నవీనుల్, గంభీర్‌తో ఆడుకున్నారు కోహ్లి అభిమానులు. మీమ్స్ తో సోషల్ మీడియాను హోరెత్తించారు. సన్ రైజర్స్ పై సెంచరీతో కోహ్లి ఆర్సీబీని గెలిపించి విషయం తెలిసిందే.

Kohli fans trolled Naveen: టైమ్ ఎవరి సొంతం కాదు. అది అందరికీ ఏదో ఒక రోజు వస్తుంది. మొన్న నవీనుల్ హక్ కు వచ్చింది. ఇప్పుడు విరాట్ కోహ్లి వంతైంది. తన టైమ్ వచ్చినప్పుడు కోహ్లి సైలెంట్ గా ఉన్నా కూడా కెలుక్కున్నాడు నవీనుల్ హక్. ఇప్పుడు కోహ్లి టైమ్ వచ్చిన తర్వాత అతని అభిమానులు ఊరుకుంటారా? రెచ్చిపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

సన్ రైజర్స్ పై కోహ్లి రికార్డు సెంచరీ తర్వాత లక్నో ప్లేయర్ నవీనుల్ హక్, ఆ టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్ లతో ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ జాతర నడుస్తోంది. వాళ్లపై ఏమాత్రం జాలి, కనికరం చూపించకుండా కోహ్లి అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. వాటిలో చాలా వరకూ ఫన్నీగా.. నవీనుల్, గంభీర్ లకు ఎక్కడో గుచ్చుకునేలా ఉన్నాయి.

తన దగ్గర పగలు, ప్రతీకారాలకు టైమ్ లేదంటూ కోహ్లి తన పని తాను చేసుకుంటుండగా.. అతని ఫ్యాన్స్ మాత్రం ప్రత్యర్థులకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. మే 1 ఆర్సీబీ, లక్నో మ్యాచ్ లో భాగంగా కోహ్లితో నవీనుల్, గంభీర్ గొడవ తర్వాత అతని అభిమానులు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఆ టైమ్ ఇప్పుడు వచ్చింది.

తమ అభిమాన క్రికెటర్ సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించిన వేళ.. అటు ఫ్యాన్స్ అతని ప్రత్యర్థులైన నవీనుల్, గంభీర్ పని పడుతున్నారు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో విరాట్ కేవలం 62 బంతుల్లోనే సెంచరీ చేసి.. తన స్ట్రైక్ రేట్ ను విమర్శిస్తున్న వారికి కూడా గట్టి సమాధానం ఇచ్చాడు. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో టీమ్ భారాన్ని తన భుజాలపై వేసుకున్న విరాట్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఈ నేపథ్యంలో నవీనుల్, గంభీర్ లక్ష్యంగా కోహ్లి ఫ్యాన్స్ క్రియేట్ చేసిన మీమ్స్ ఆకట్టుకుంటున్నాయి. అందులో కొన్ని కింద ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం