Kohli vs Gambhir: కోహ్లి, గంభీర్ ఫైట్‌పై వీడియో గేమ్.. ఈ ఫన్నీ వీడియో చూశారా?-kohli vs gambhir fight now becomes a video game ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Kohli Vs Gambhir Fight Now Becomes A Video Game

Kohli vs Gambhir: కోహ్లి, గంభీర్ ఫైట్‌పై వీడియో గేమ్.. ఈ ఫన్నీ వీడియో చూశారా?

Hari Prasad S HT Telugu
May 09, 2023 04:25 PM IST

Kohli vs Gambhir: కోహ్లి, గంభీర్ ఫైట్‌పై వీడియో గేమ్ వచ్చేసింది. ఇప్పుడీ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు క్రికెటర్ల మధ్య జరిగిన ఫైట్ నే నేపథ్యంగా తీసుకొని ఓ వ్యక్తి వీడియో గేమ్ క్రియేట్ చేయడం విశేషం.

విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్
విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ (PTI)

Kohli vs Gambhir: విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య ఐపీఎల్ ఫైట్ కాస్తా ఇప్పుడు వీడియో గేమ్ రూపంలోకి మారింది. ఐపీఎల్ 2023లో మే 1న లక్నో, ఆర్సీబీ మ్యాచ్ తర్వాత కోహ్లి, గంభీర్ గొడవ పడిన విషయం తెలిసిందే. తొలిసారి 2013లో ఇదే ఐపీఎల్లో గొడవ పడిన ఈ ఇద్దరూ పదేళ్ల తర్వాత మరోసారి ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు.

అయితే ఇప్పుడీ ఫైట్ ను ఓ వ్యక్తి తన క్రియేటివిటీ ఉపయోగించి వీడియో గేమ్‌గా మలిచాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కోహ్లి, గంభీర్ తమ ఐపీఎల్ జెర్సీల్లో కనిపిస్తారు. ఇద్దరూ చేతుల్లో బ్యాట్లు పట్టుకొని మొదట కాస్త వర్కౌట్స్ చేస్తారు. ఆ తర్వాత అటాక్ అంటూ ఒకరి టీమ్ పై మరొకరు దాడి చేస్తారు.

ముందు కోహ్లి, గంభీర్ బ్యాట్లతో కొట్టుకుంటే.. వాళ్ల వెనుక మిగతా ప్లేయర్స్ కూడా బాహాబాహీకి దిగుతారు. అలా కొద్దిసేపు కొట్టుకున్న తర్వాత ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కింద పడిపోతారు. లక్నో గెలిచినట్లుగా చూపించారు. ఈ సీజన్ ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ రెండుసార్లు పోటీ పడగా.. చెరొకసారి విజయం సాధించిన విషయం తెలిసిందే.

బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, లక్నోలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించాయి. అయితే ఈ మ్యాచ్ ల కంటే కూడా కోహ్లి, గంభీర్ గొడవే అభిమానులను ఎక్కువగా ఆకర్షించింది. దీంతో కొందరు ఔత్సాహికులు.. వీళ్ల గొడవనే ఇలా వీడియో గేమ్‌గా మార్చేశారు. గ్రౌండ్ లో కేవలం వీళ్లను గొడవను చూసి ఏమీ చేయలేకపోతున్నామే అనుకునే ఈ రెండు జట్ల అభిమానులు.. ఈ వీడియో గేమ్ ద్వారా ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్కింది.

WhatsApp channel

సంబంధిత కథనం