Kohli vs Gambhir: 45 నిమిషాలు నవ్వుతూ మాట్లాడుకున్న కోహ్లి, గంభీర్.. షాక్ తిన్న లక్నో ప్లేయర్స్-kohli vs gambhir as both players talked about 45 minutes in bangalore ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Kohli Vs Gambhir As Both Players Talked About 45 Minutes In Bangalore

Kohli vs Gambhir: 45 నిమిషాలు నవ్వుతూ మాట్లాడుకున్న కోహ్లి, గంభీర్.. షాక్ తిన్న లక్నో ప్లేయర్స్

Hari Prasad S HT Telugu
May 08, 2023 05:35 PM IST

Kohli vs Gambhir: 45 నిమిషాలు నవ్వుతూ మాట్లాడుకున్న కోహ్లి, గంభీర్ ఆ వెంటనే ఇలా కొట్లాడటం చూసి షాక్ తిన్నారట లక్నో ప్లేయర్స్. ఆర్సీబీ, లక్నో మ్యాచ్ తర్వాత కోహ్లి, గంభీర్ గొడవ పడిన విషయం తెలిసిందే.

విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్
విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్

Kohli vs Gambhir: ఐపీఎల్ 2023లో వారం కిందట విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన గొడవ ఎంతటి దుమారం రేపిందో తెలుసు కదా. పదేళ్లుగా తమ మధ్య ఉన్న విభేదాలను మరోసారి ఈ ఇద్దరు ప్లేయర్స్ తెరపైకి తెచ్చారు. మే 1న ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ తర్వాత కోహ్లి, గంభీర్ గొడవ పడ్డారు. అయితే అంతకుముందు బెంగళూరులో ఈ ఇద్దరూ కలిసినప్పుడు 45 నిమిషాల పాటు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారట.

కానీ మూడు వారాల వ్యవధిలోనే వీళ్లు ఇలా గొడవ పడటం చూసి లక్నో టీమ్ ప్లేయర్స్, మేనేజ్‌మెంట్ షాక్ తిన్నట్లు దైనిక్ జాగరన్ రిపోర్టు వెల్లడించింది. ఈ సీజన్ లో మొదట బెంగళూరు వెళ్లి లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఆర్సీబీతో మ్యాచ్ ఆడింది. అప్పుడు కలుసుకున్న కోహ్లి, గంభీర్, లక్నో అసిస్టెంట్ కోచ్ విజయ్ దహియా.. ఎంతో సానుకూల వాతావరణంలో 45 నిమిషాల పాటు మాట్లాడుకున్నారని ఎల్ఎస్‌జీ టీమ్ మేనేజ్ మెంట్ చెప్పింది.

అది జరిగిన మూడు వారాల తర్వాత మరోసారి ఆ టీమ్ తో మ్యాచ్ కోసం ఆర్సీబీ లక్నో వెళ్లింది. ఆ మ్యాచ్ లోనే మొదట కైల్ మేయర్స్ ను కోహ్లి ఏదో అనడం, తర్వాత నవీనుల్ హక్ తోనూ గొడవ పడటంతో మ్యాచ్ ముగిసిన తర్వాత గంభీర్ ఆవేశంగా కనిపించాడు. కోహ్లితో మాట్లాడుతున్న కైల్ మేయర్స్ ను గంభీర్ దూరంగా తీసుకెళ్లాడు. అది చూసి విరాట్ ఏదో అనడంతో గంభీర్ అతని మీదికి దూసుకెళ్లాడు.

ఈ గొడవ కారణంగా ఈ ఇద్దరూ తమ వంద శాతం మ్యాచ్ ఫీజులను జరిమానాగా చెల్లించాల్సి వచ్చింది. అయితే 20 రోజుల కిందట అంత ఫ్రెండ్లీగా కనిపించిన కోహ్లి, గంభీర్ సడెన్ గా ఇంతలా గొడవపడటం మాత్రం లక్నో టీమ్ ను షాక్‌కు గురి చేసినట్లు దైనిక్ జాగరన్ తన రిపోర్టులో వెల్లడించింది. తమ ప్లేయర్స్ తో కోహ్లి అనుచింతంగా ప్రవర్తించడం వల్లే గంభీర్ అంతలా రియాక్టయినట్లు కూడా ఆ పత్రిక తెలిపింది.

ఆ మ్యాచ్ లో నవీనుల్ హక్ తో గొడవ సందర్భంగా అతని తలకేసి బంతిని బలంగా కొట్టు అని సిరాజ్ తో కోహ్లి అన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తాను బౌన్సర్ వేయాల్సిందిగా సిరాజ్ కు చెప్పాను తప్ప.. అలా కొట్టమని చెప్పలేదని విరాట్ బీసీసీఐ అధికారితో చెప్పాడు. అంతేకాదు మ్యాచ్ తర్వాత నవీనుల్ హక్ దూకుడు వ్యవహారంపై లక్నో టీమ్ కు కూడా విరాట్ ఫిర్యాదు చేశాడట.

WhatsApp channel

సంబంధిత కథనం