Vastu remedies for students: ఈ పరిహారాలు పాటిస్తే మీ పిల్లలలో పరీక్షల భయం తొలగిపోతుంది.. విజయం సాధిస్తారు
Vastu remedies for students: పరీక్షలంటే విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఈ వాస్తు పరిహారాలు పాటించడం వల్ల వాళ్ళలో ఉన్న పరీక్షల భయం తొలగిపోతుంది. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతతో విజయం సాధిస్తారు.
Vastu remedies for students: మార్చి వస్తుందంటే విద్యార్థులందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇది పరీక్షల సమయం. ముఖ్యంగా పది, పన్నెండు తరగతుల విద్యార్థులు ఎక్కువ ఒత్తిడితో ఉండేటువంటి సమయం. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మార్కులు సాధించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
పరీక్షల సమయం చాలా ఒత్తిడితో కూడుకున్నది. అటు తల్లిదండ్రుల దగ్గర నుంచి మాత్రమే కాదు తోటి వారి మీద పైచేయి సాధించాలనే తపన ప్రతీ ఒక్క విద్యార్థిలో ఉంటుంది. వీటి వల్ల ఒత్తిడి, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం విద్య పనితీరు మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు తల్లిదండ్రులు పిల్లలకు సహకరించాలి. అప్పుడే వాళ్ళ కెరీర్ లో ఉత్తమ విజయాలు అందుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం ప్రకారం తల్లి దండ్రులు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల పిల్లల భవిష్యత్ కి బంగారు బాటలు వేయవచ్చు.
పిల్లల బర్త్ చార్ట్ ప్రకారం మానసిక ఒత్తిడి, చదువులో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించేందుకు వాస్తు శాస్త్రం కొన్ని సూచనలు చేస్తుంది. పరీక్ష సంబంధించిన ఒత్తిడిని తగ్గించేందుకు కొన్ని వాస్తు పరిహారాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పరీక్ష ఒత్తిడిని తగ్గించేందుకు కొన్ని ప్రభావవంతమైన వాస్తు నివారణలు ఇవి. వీటిని పాటించి చూడండి. మీ పిల్లలు చదువులో ఉన్నతంగా ఉంటారు.
గది వాస్తు
చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని పిల్లలకు కలిగేలా చేయాలి. వారి స్టడీ రూమ్ ఏ దిశలో ఉందో చూసుకోవడం చాలా ముఖ్యం. చదువులో సానుకూల శక్తి ప్రవాహాన్ని సులభతరం చేసేందుకు పిల్లల స్టడీ రూమ్ ఇంటికి ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఉండేలా చూసుకోండి. అప్పుడు వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు.
సూర్యకాంతి ముఖ్యమే
పిల్లల గదిలో పగటి పూట లైట్లు వేసి ఉంచడాన్ని నివారించండి. ఇది వారిలో ప్రతికూల ఆలోచనలు పెంచుతుంది. నిర్ణయాత్మక సామర్థ్యాలని అడ్డుకుంటుంది. ఏకాగ్రతకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా చేసేందుకు స్టడీ రూమ్ లో సూర్య కాంతి సరిగా ఉండేలా చూసుకోవాలి. గాలి ప్రసరణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.
బెడ్ ప్లేస్ మెంట్, కలర్ థెరపీ
పిల్లల మంచం గోడ నుంచి కొద్దిగా దూరంగా ఉండేలా చూడాలి. గ్రహాలని బలోపేతం చేసేందుకు పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నీలం వంటి మిశ్రమ రంగుల్లోని బెడ్ షీట్లు ఉపయోగించాలి. అలాగే పిల్లలు తల తూర్పు వైపు పెట్టుకుని నిద్రపోతే మంచిది.
సరస్వతీ మంత్రం
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చదివితే జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చదివింది మొత్తం గుర్తు ఉంటుంది. అందుకే ఈ సమయంలో నిద్రలేవడం అలవాటు చేయాలి. అలాగే మానసికంగా దృఢంగా మారేందుకు సరస్వతీ మంత్రాన్ని వారికి నేర్పించండి. ప్రతిరోజూ సరస్వతీ మంత్రం పఠించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వాళ్ళు చదువుకునే గదిలో తూర్పు వైపు గోడ మీద ఉదయించే సూర్యుని చిత్ర పటాన్ని పెట్టండి.
సాత్విక ఆహారం, క్రమశిక్షణ
పిల్లల ఆలోచనలను శుద్ధి చేసేందుకు, వారిని మానసికంగా బలంగా మార్చేందుకు సాత్విక ఆహారాన్ని అందించండి. క్రమశిక్షణగా మెలగడం నేర్పించాలి.