Peacock feather: నెమలి ఈక ఇంట్లో పెట్టుకుంటే మీ సమస్యలన్నీ దూరమవుతాయి.. సంపద పెరుగుతుంది
Peacock feather: నెమలి ఈక చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ అదృష్టం మరింత రెట్టింపు అవుతుంది. మీ సమస్యలు తొలగిపోతాయి.
Peacock feather: చిన్నప్పుడు చాలా మంది పుస్తకాలలో నెమలి ఈకలు పెట్టుకుంటారు. అవి ఉండటం వల్ల చదువు బాగా వస్తుందని అంటారు. అది మాత్రమే కాదండోయ్ నెమలి ఈక పిల్లలని పెడుతుందని నమ్ముతారు. అది నిజం కాదని కొట్టేస్తారు కానీ పిల్లల సంతోషాన్ని చెడగొట్టడం ఎందుకని నవ్వి ఊరుకుంటారు. అయితే నెమలి ఈక నిజంగానే చాలా మంచి చేస్తుంది.
అందంగా కనిపించడం కోసం కొందరు ఇళ్లల్లో నెమలి ఈక పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అలంకరణ వస్తువుగా కొంతమంది దాన్ని చూస్తారు. వాస్తవానికి అది ఇంటికి అందం ఇవ్వడం మాత్రమే కాదు పాజిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షిస్తుంది. వాస్తు, జ్యోతిష శాస్త్రం ప్రకారం నెమలీక చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అంతటి పవిత్రమైనది కనుకే శ్రీకృష్ణుడు తన తల మీద ఎప్పుడూ నెమలి ఈక ధరించి ఉంటాడు.
ప్రేమ, జ్ఞానం, కళతో సంబంధం కలిగిన శ్రీకృష్ణుడు, సరస్వతీ దేవికి నెమలీకలు ఎంతో ప్రీతికరమైనవి. ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల సానుకూల శక్తిని, సంపద, అదృష్టాన్నిని ఆకర్షిస్తాయి. వాస్తు ప్రకారం మీ ఇంట్లో నెమలిగా ఉండటం చాలా మంచిది.
పాజిటివ్ ఎనర్జీ కోసం..
ఇంట్లో నెమలి ఈక పెట్టుకోవడం వల్ల సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. మీ ఇంటికి శ్రేయస్సును అందిస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి ఉత్తర దిశ సంపద శ్రేయస్సును పెంచుతుంది. ఈ దిశలో నెమలి ఈక పెట్టుకోవడం చాలా మంచిది. ఉత్తరాన పెట్టుకోవడం వల్ల ఆర్థిక పురోగతితో పాటు విజయాన్ని ఆకర్షిస్తుంది. సంపన్న వాతావరణం సృష్టిస్తుంది.
దుష్టశక్తుల నుంచి రక్షణ
దుష్ట శక్తుల్ని పారద్రోలే సామర్థ్యం నెమలి ఈకలకు ఉంటుందని చెప్తారు. ఇది ఇంటికి ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందని నమ్ముతారు. ప్రతికూల ప్రభావాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
సృజనాత్మకతను పెంచుతుంది
నెమలీక ఇంట్లో ఉండటం వల్ల సృజనాత్మక స్ఫూర్తి, కళాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు. ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్ లో పని చేస్తున్న వాళ్ళు ఇంట్లో నెమలి ఈకని పెట్టుకుంటే ఆ రంగంలో ఉన్నతంగా రాణిస్తారు.
పంచభూతాలు సమతుల్యం
భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాల శక్తులని ఇది సమతుల్యం చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇది ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.
భార్యాభర్తల బంధం బలోపేతం
నెమలి ఈక ఇంట్లో పెట్టుకుంటే భార్యాభర్తల బంధం బలపడుతుంది. ఇది వారి పడకగదిలో మంచానికి ఎదురుగా పెట్టుకుంటే కలహాలు తగ్గుతాయి. వారి మధ్య ప్రేమానురాగాలు పెరిగి బంధం మరింత పెరుగుతుంది.
వాస్తు ప్రకారం ఎలా ఉపయోగించాలి?
నెమలి ఈకని ఎత్తైన ప్రదేశంలో పెట్టాలి పూజ గదిలో పెట్టుకోవచ్చు. పూజ గదిలో పెట్టుకుంటే దాని శక్తిని మరింత పెంచుతుంది. ప్రభావవంతంగా పని చేస్తుంది.
ఇంటికి పశ్చిమ దిశలో ఎప్పుడు పెట్టకూడదు. ఇది జీవితంలో ప్రతికూల శక్తిని, సమస్యలని కలిగిస్తుంది. దుబారా ఖర్చులు పెరుగుతాయి. అందుకే ఈ దిశలో పెట్టడం నివారించండి.
నెమలి ఈకని ఎప్పుడు శుభ్రంగా, సురక్షితంగా ఉంచుకోవాలి. తడిగా ఉండకూడదు. సూర్య కాంతి నేరుగా తగలకూడదు. అది దాని నాణ్యతని దెబ్బతీస్తుంది. శక్తిని తగ్గిస్తుంది.
నెమలి ఈకని మరింత అందంగా మార్చుకోవచ్చు. దాన్ని ఒక అందమైన కూజా లేదా బుట్టలో పెట్టుకోవచ్చు. పువ్వులు, పూసలతో అలంకరించుకోవచ్చు. అలా చేస్తే దాని అందం, ఆకర్షణ రెట్టింపు అవుతుంది.
టాపిక్