Tress as per Nakshatram: ఏ నక్షత్ర జాతకులు ఏ మొక్కలు నాటి పూజిస్తే ఆర్థిక వృద్ధి సాధిస్తారు-nakshatra trees 27 nakshatra trees and their benefits as per astrology ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tress As Per Nakshatram: ఏ నక్షత్ర జాతకులు ఏ మొక్కలు నాటి పూజిస్తే ఆర్థిక వృద్ధి సాధిస్తారు

Tress as per Nakshatram: ఏ నక్షత్ర జాతకులు ఏ మొక్కలు నాటి పూజిస్తే ఆర్థిక వృద్ధి సాధిస్తారు

Gunti Soundarya HT Telugu
Feb 12, 2024 03:06 PM IST

Nakshatra trees: మీ జన్మ నక్షత్రం ప్రకారం ఏ మొక్క నాటి పూజించడం వల్ల మేలు జరుగుతుందో తెలుసా? ఈ మొక్కలు ఇంట్లోనే నాటాలని లేదు. ఎక్కడ నాటినా కూడా వాటిని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ పూజ చేస్తే శుభ ఫలితాలు పొందుతారు.

ఏ నక్షత్రానికి ఏ చెట్టు నాటాలి?
ఏ నక్షత్రానికి ఏ చెట్టు నాటాలి? (pixabay)

Nakshatra trees: ప్రతి ఒక్కరికీ జాతకం ప్రకారం నక్షత్రం, గోత్రం ఉంటాయి. పెళ్ళిళ్ళు లేదా ఏదైన శుభకార్యాలు చేసే ముందు జాతకం చూపించడానికి వీటిని చెప్తూ ఉంటారు. తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా నక్షత్రాలని పట్టించుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలకు దేవతలు, అధి దేవతలు ఉంటారు. అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కో వృక్షం కూడా ఉందని నమ్ముతారు.

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం దేవతలు వృక్షాలలో నివశిస్తారని నమ్ముతారు. అందుకే వాటికి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే జన్మ నక్షత్రం అనుసరించి కొన్ని మొక్కలు నాటడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నక్షత్రాల అనుసారం మొక్కలు పెంచితే వాటి వల్ల మనకి మాత్రమే కాదు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఏ నక్షత్రం వాళ్ళు ఏ మొక్కలు నాటాలో తెలుసా?

అశ్వినీ నక్షత్రం

ఈ నక్షత్రం కలిగిన వాళ్ళు జీడి మామిడి చెట్టు నాటితే మంచిది. ఈ చెట్టుకి క్రమం తప్పకుండా నీటిని పోసి 11 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే కోరికలు నెరవేరతాయి. జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. ఈ చెట్టు నాటితే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. సంతానం కలుగుతుంది.

భరణి నక్షత్రం

భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టు నాటాలి. ఈ చెట్టుకు క్రమం తప్పకుండా కుంకుమ పెట్టాలి. ఈ చెట్టుని పూజించడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

కృత్తిక నక్షత్రం

మేడి చెట్టుని నాటితే గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే శ్రేయస్సు, సంతోషం లభిస్తాయి.

రోహిణి నక్షత్రం

రోహిణి నక్షత్రం కలిగిన జాతకులు నేరేడు చెట్టు నాటితే మంచి ఫలితాలు పొందుతారు. కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. మంచి ప్రవర్తన వస్తుంది.

మృగశిర నక్షత్రం

మారేడు చెట్టుని పెంచడం వల్ల మృగశిర నక్షత్రం వారికి గొంతుకి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ చెట్టుని పూజిస్తే ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఆరుద్ర

చింతచెట్టుని పెంచుకుంటే మంచిది. ఈ చెట్టుని నాటి సంరక్షించుకుంటే విజయాలు మీ సొంతం అవుతాయి.

పునర్వసు

వెదురు లేదా గన్నేరు చెట్టుని పునర్వసు నక్షత్ర జాతకులు పూజిస్తే మంచిది. ఈ చెట్టు ఆకులు తమ వెంట ఉంచుకుంటే అదృష్టం లభిస్తుంది.

పుష్య నక్షత్రం

రావి చెట్టుని పూజిస్తే పుష్య నక్షత్ర జాతకులకు కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఆశ్లేష నక్షత్రం

ఈ నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక్ చెట్టుని నాటితే మంచిది. సమస్యల నుంచి సులువుగా బయట పడతారు.

మఖ నక్షత్రం

మర్రి చెట్టు పెంచుకోవచ్చు. ఇది ఇంట్లో ఉంటే మంచిది కాదని అంటారు. అందుకే రోడ్డు పక్కన లేదా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మర్రి చెట్టు నాటి దాన్ని సంరక్షించుకుంటూ ఉండవచ్చు. ఈ చెట్టుని పూజిస్తే భార్యాభర్తల బంధం బలపడుతుంది. పనుల్లోని ఆటంకాలు తొలగిపోతాయి.

పుబ్బ నక్షత్రం

పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టు నాటి పూజిస్తే మంచిది. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.

ఉత్తర నక్షత్రం

జువ్వి చెట్టుని పెంచాలి. గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయట పడేస్తుంది.

హస్త నక్షత్రం

సన్నజాజి, కుంకుడు చెట్లు పెంచుకోవచ్చు. పొట్ట సంబంధిత బాధల నుంచి విముక్తి కలుగుతుంది. దైవభక్తితో ఉంటారు.

చిత్త నక్షత్రం

చిత్త నక్షత్రం వాళ్ళు తాడి చెట్టుని పూజించవచ్చు. అల్సర్, పేగు సంబంధిత సమస్యలు నయం అవుతాయి. మంచి తెలివితేటలతో అందరి నుంచి ప్రశంసలు దక్కించుకుంటారు.

స్వాతి నక్షత్రం

మద్ది చెట్టు పెంచి పూజించడం వల్ల గర్భ సంచి సమస్యల నుంచి బయట పడతారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు.

విశాఖ నక్షత్రం

వెలగ లేదా మొగలి చెట్టు పెంచుకోవచ్చు. ధైర్యంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

అనురాధ నక్షత్రం

పొగడ చెట్టు నాటి పూజించాలి.

జ్యేష్ఠ నక్షత్రం

కొబ్బరి చెట్టు నాటితే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు.

మూల నక్షత్రం

వేగి చెట్టు పూజిస్తే నోటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

పూర్వాషాడ నక్షత్రం

నిమ్మచెట్టు పూజిస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఉత్తరాషాడ నక్షత్రం

పనస చెట్టు పెంచుకుంటే చర్మ వ్యాధులు దూరం అవుతాయి. ఆర్థిక పరిస్థితిలో ఆశించిన మార్పులు వస్తాయి.

శ్రవణ నక్షత్రం

తెల్ల జిల్లేడు చెట్టు నాటి పూజిస్తే ఆర్థికంగా బలపడతారు.

ధనిష్ట నక్షత్రం

పవిత్రమైన జమ్మి చెట్టు నాటి పూజించాలి. మెదడు సమస్యలు తగ్గుతాయి.

శతభిష నక్షత్రం

అరటి చెట్టు నాటి పూజిస్తే మోకాళ్ళ సమస్యలు తగ్గుతాయి.

పూర్వాభాద్ర

ఈ నక్షత్ర జాతకులు మామిడి చెట్టు పెంచితే వృత్తిలో రాణిస్తారు.

ఉత్తరాభాద్ర

వేప చెట్టు పెంచితే వైవాహిక జీవితంలో సమస్యలు రావు. ఉన్నత పదువులు అధిరోహిస్తారు.

రేవతి నక్షత్రం

విప్ప చెట్టు రేవతి నక్షత్రం వాళ్ళకి విజయాన్ని ఇస్తుంది.