Goddess vahanas: ఏ దేవతకి ఏ వాహనం ఉంటుంది? వాటిని ఉపయోగించడం వెనుక కారణం ఏంటి?
Goddess vahanas: దేవతలకి వాహనాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ వాహనాలు వినియోగించడం వెనుక కారణం కూడా ఉంది. అవి ఏంటో తెలుసా?
Goddess vahanas: హిందూ మతంలో ఆరాధించే దేవుళ్లందరికి ఒక్కో ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. కొందరు రాక్షసులని సంహరించారు. మరికొందరు లోకసృష్టి కోసం ఎన్నో పనులు చేశారు. ఒక్కో దేవతకి ఒక్కో నైవేద్యం పెడతారు. నైవేద్యాలకి విశిష్టత ఉంటుంది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో వాహనం కూడా ఉంటుంది. ఆయా వాహనాల మీద దేవుళ్ళు సంచరిస్తారని, ప్రపంచాన్ని పర్యటించడానికి ఉపయోగించేవాళ్ళు. ఈ వాహనాలకి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ దేవుళ్ళు, దేవతలకి వాహనాలు వాటి వెనుక ఉన్న అర్థాలు ఏంటో తెలుసా?
శివుడు వాహనం నంది
సృష్టికర్త శివుడు తన వాహనంగా నంది ఏర్పాటు చేసుకున్నట్టు చెబుతారు. పవిత్రమైన నందిని స్వారీ చేసినట్టుగా చెప్తారు. నంది శివుని నమ్మకమైన వాహనంగా ద్వారపాలకుడిగా పని చేస్తాడు. శివుని వాహనంగా నందిని ఎంపిక చేయడం వెనుక రెండు అత్యంత ప్రసిద్ధమైన కథలు ఉన్నాయి. నంది బలం, విధేయత, సంతానోత్పత్తి సారాంశాన్ని సూచిస్తుందని ఒక కథ చెబుతుంది. సంతానోత్పత్తితో అనుబంధం, సృష్టి, విధ్వంసం శివుని పాత్రకు తగిన గుణముగా చెప్తారు. నంది వాస్తవానికి శిలాద మహర్షి కొడుకు అని మరొక కథ చెప్తారు. ఆయన శివుడికి పరమ భక్తుడు. అతనికి అమరత్వం వరం ఉంది. శివుడుకి వాహనంగా మారతాడనే వరం కూడా ఉన్నట్టు పురాణాలు చెబుతాయి.
శనీశ్వరుడికి కాకి
శని దేవుడికి అనేక వాహనాలు ఉన్నాయని విశ్వసిస్తున్నప్పటికీ కాకి అత్యంత ప్రాచుర్యం పొందింది. శని భగవానుడు న్యాయ దేవుడు. అతని వాహనం అనేక విభిన్న అర్థాలని కలిగి ఉంటుంది. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ దేవత అతని వాహనంగా ఒక కాకితో కలిసి ఉంటుంది. కాకి చాలా చురుకైన అవగాహన, తెలివితేటలకి చిహ్నంగా భావిస్తారు. కాకికి నిశితమైన దృష్టిని కలిగి ఉంటుంది. శని దేవుడు తన కఠినమైన తీర్పులు ఇస్తూ ఎప్పుడూ కోపంగా ఉంటాడు. కాకి తన నిర్ణయాలు ఇస్తూ శని దేవుడికి సహాయం చేస్తూ ప్రపంచంపై నిఘా ఉంచుతుందని అంటారు.
మరొక ప్రతీక వాదం ప్రకారం కాకి మృత్యు దేవత దూతలుగా చెప్తారు. అందుకే కాకి ఎదురొస్తే అశుభంగా భావిస్తారు. శని దేవుడు మానవుల జీవిత, మరణ చక్రంలో భాగమైనందున కాకి కూడా రెండింటికీ ప్రయోజనం అందిస్తుందని అంటారు.
ఇంద్రుడు వాహనం ఐరావతం
స్వర్గానికి రాజు ఇంద్రుడు. ఆయన వాహనం ఐరావతం అంటే తెల్లని ఏనుగు. ఉరుములు, మెరుపులుకి రాజుగా చెప్తారు. ఇంద్రుడు వాహనం ఐరావతం తెల్ల ఏనుగు స్వచ్చట, బలం, సమృద్ధికి చిహ్నంగా కనిపిస్తుంది. వర్షపాతం, సంతానోత్పత్తికి బాధ్యత వహించే దేవుడిగా ఇంద్రుడు ఉంటాడు. ఏనుగు వాహనం నీరు, శ్రేయస్సుతో అనుబంధం కలిగి ఉంటుంది. మరొక నమ్మకం ఏంటంటే ఐరావతం స్వర్గానికి కాపలాదారుగా పని చేస్తుందని అంటారు.
దుర్గా మాత వాహనం సింహం
దుర్గామాత స్త్రీ శక్తి స్వరూపం. సింహం మీద దుర్గాదేవి స్వారీ చేస్తుంది. ఇది శక్తి, ధైర్యం, పరాక్రమానికి ప్రతీక. సింహంతో దుర్గాదేవి అనుబంధం భయంకరమైన రక్షణాత్మక స్వభావానికి చిహ్నంగా ఉంటుంది. ఆమె తరచుగా రాక్షస సంహారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి ప్రపంచాన్ని రక్షించడం వంటివి చేస్తుంది. సింహంపై స్వారీ చేస్తూ దుర్గాదేవి ఎలాంటి కష్టాలనైన అధిగమించగల గొప్ప స్త్రీ శక్తిని సూచిస్తుంది.
సరస్వతి దేవికి హంస
జ్ఞానం, చదువు, కళల దేవత సరస్వతీ దేవికి వాహనంగా హంస ఉంటుంది. సరస్వతీ దేవి హంసని వాహనంగా ఎంచుకోవడం వెనుక స్వచ్చత, దయ, మంచి చెడుల మధ్య వివక్షని చూపే సామర్థ్యానికి చిహ్నంగా భావిస్తారు. క్రమశిక్షణ, స్వచ్చతకి ప్రతీకగా ఉంటుంది. విద్యార్థి జీవితంలో ఈ రెండూ ముఖ్యమైన అంశాలు. అందుకే హంస సరస్వతి భక్తులకి సరైన మార్గాలని అనుసరించడంలో సహాయపడుతుంది.