Mia Khalifa : అటు ఇజ్రాయెల్-​ పాలస్తీనా యుద్ధం.. ఇటు ట్రెండింగ్​లో మియా ఖలీఫా!-mia khalifa supports palestine amid hamas attack on israel gets blasted ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mia Khalifa : అటు ఇజ్రాయెల్-​ పాలస్తీనా యుద్ధం.. ఇటు ట్రెండింగ్​లో మియా ఖలీఫా!

Mia Khalifa : అటు ఇజ్రాయెల్-​ పాలస్తీనా యుద్ధం.. ఇటు ట్రెండింగ్​లో మియా ఖలీఫా!

Sharath Chitturi HT Telugu
Oct 09, 2023 04:06 PM IST

Mia Khalifa latest news : ఇజ్రాయెల్​- పాలస్తీనా యుద్ధం మధ్యలో.. మియా ఖలీఫా పేరు ట్రెండింగ్​గా మారింది. అయితే.. ఇందుకు ఓ కారణం ఉంది. అదేంటంటే..

అటు ఇజ్రాయెల్​ పాలస్తీనా యుద్ధం.. ఇటు ట్రెండింగ్​లో మియా ఖలీఫా!
అటు ఇజ్రాయెల్​ పాలస్తీనా యుద్ధం.. ఇటు ట్రెండింగ్​లో మియా ఖలీఫా! (AP, Instagram)

Mia Khalifa latest news : ఇజ్రాయెల్​- పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంటే.. ఇటు సోషల్​ మీడియాలో, మరీ ముఖ్యంగా ట్విట్టర్​ (ఎక్స్​)లో మాజీ అడల్ట్​ ఫిల్మ్​ నటి మియా ఖలీఫా పేరు ట్రెండింగ్​గా మారింది! పాలస్తీనాకు ఆమె మద్దతు ప్రకటించడంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

yearly horoscope entry point

ట్రెండింగ్​లో మియా ఖలీఫా..

శనివారం ఉదయం.. ఇజ్రాయెల్​పై శనివారం ఉదయం రాకెట్లతో విరుచుకుపడింది పాలిస్తీనాలోని హమాస్​ బృందం. సరిహద్దు దాటుకుని ఇజ్రాయెల్​లోకి ప్రవేశించి, విధ్వంసం సృష్టించింది. ఆ ఆకస్మిక దాడి నుంచి ఆలస్యంగా తేరుకున్నప్పటికీ.. ఇజ్రాయెల్​ కూడా ప్రస్తుతం ప్రతిఘటిస్తోంది.

కాగా.. ఈ పూర్తి వ్యవహారంలో మియా ఖలీఫా.. పాలస్తీనాకు మద్దతు ప్రకటించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Mia Khalifa supports Palestine : "పాలస్తీనా పరిస్థితి చూసిన తర్వాత.. మీరు పాలస్తీనావాసులకు మద్దతు ప్రకటించకపోతే.. ఈ యుద్ధంలో మీరు తప్పుడు వైపు ఉన్నట్టు అర్థం. ఈ విషయాన్ని త్వరలోనే చరిత్ర నిజం చేస్తుంది," అని శనివారం నాడు చేసిన పోస్ట్​లో వ్యాఖ్యానించింది మియా ఖలీఫా. ఈ ట్వీట్​ వెంటనే వైరల్​గా మారిపోయింది.

ఇక అప్పటి నుంచి మియా ఖలీఫాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

"ఇజ్రాయెల్​ పరిస్థితిని చూసిన తర్వాత కూడా.. మతంతో నీ కళ్లు మూసుకుని పోతే.. అప్పుడు నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నట్టు అర్థం," అని ఓ వ్యక్తి కామెంట్​ చేశారు. ఇలా చాలా నెగిటివ్​ కామెంట్లే ఉన్నాయి. వీటిల్లో కొన్నింటికి ఆమె సమాధానాలు కూడా ఇచ్చింది.

Israel Palestine war : అదే సమయంలో.. ప్రముఖ మీడియా పర్సన్​ కైల్​ జెన్నర్​.. ఇజ్రాయెల్​కు అనుకూలంగా పోస్ట్​ చేయడాన్ని మియా ఖలీఫా ఖండించింది. "ఇప్పుడు, ఎల్లప్పుడు.. మేము ఇజ్రాయెల్​ ప్రజల వెన్నంటే ఉంటాము," అని కైల్​ పోస్ట్​ చేసింది. ఆ తర్వాత.. కొద్ది సేపటికే ఆ పోస్ట్​ను డిలీట్​ చేసేసింది.

ఇంతలో కైల్​ పోస్ట్​పై మియా ఖలీఫా కాస్త ఘాటుగానే స్పందించింది.

"నిజమైన జర్నలిజం జీవిస్తూ ఉంటే.. ఎవరైనా వెళ్లి మిడిల్​ ఈస్ట్​లో నెలకొన్న భౌగోలిక ఉద్రిక్తతల గురించి ప్రశ్నించాలి. తన 40మిలియన్​ మంది ఫాలోవర్ల కోసం తాపత్రయపడుతున్న కైల్​.. చూపు తిప్పుకోకుండా సమాధానం ఇవ్వాలి," అని మియా ఖలీఫా కామెంట్​ చేసింది.

Hamas attack on Israel : మరోవైపు పాలస్తీనాకు మద్దతు ఇవ్వడంపై వస్తున్న వ్యతిరేకత గురించి కూడా మియా మాట్లాడింది.

"పాలస్తీనాకు మద్దతిస్తుండటంతో నాకు అనేక వ్యాపార అవకాశాలు చేయి జారిపోయాయి. కానీ ఇలాంటి వారితో బిజినెస్​ చేసే ముందు ఎందుకు ఆలోచించలేదని, నాపై నాకు కోపంగా ఉంది," అని ఆమె పేర్కొంది.

Whats_app_banner

సంబంధిత కథనం