Yoga for Fertility | స్త్రీ, పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచే 5 యోగాసనాలు!
మగవారిలో అయినా, ఆడవారిలో అయినా లైంగిక కోరికలను ప్రేరేపించి సంతానోత్పతికి సహాయపడే కొన్ని యోగాసనాలు ఉన్నాయి. అవి ఏంటి? ఎలా చేయాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి..
ఏ వైద్యం అందివ్వలేని ఆరోగ్యాన్ని యోగా ఇస్తుంది. ఏ ఔషధం తీర్చలేని బాధను యోగా తీరుస్తుంది. ఎన్నో రకాల శారీరక, మానసిక, సామాజిక సమస్యలకు యోగా మీకు పరిష్కారాన్ని చూపుతుంది. యోగాతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే దీనిని ప్రపంచమే అనుసరిస్తోంది. యోగా మీకు నాణ్యమైన జీవితాన్ని ప్రసాదించడమే కాకుండా, జీవం పుట్టుకకు కూడా మీకు తోడ్పాటును అందిస్తుంది.
స్త్రీ, పురుషుల పునరుత్పత్తి సామర్థ్యాన్ని యోగా మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో, హార్మోన్లను సమతుల్యం చేయడంలో యోగాభ్యాసం ఎంతో ప్రభావవంతమైనదని అధ్యయనాలు నిరూపించాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక నివేదికలో యోగా థెరపీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అవయవాల సరైన పనితీరును పెంచుతుంది, లైంగిక కోరికలను ప్రేరేపిస్తుంది. మొత్తంగా లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని పేర్కొనడం జరిగింది.
యోగాలోని ఫెర్టిలిటీ వ్యాయామాలు స్త్రీలలో ఎండోక్రైన్ (హార్మోనల్) వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. అండాశయాలను, గర్భాశయాన్ని ప్రేరేపిస్తాయని క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డాక్టర్ కవితా సింగ్ తెలిపారు.
ఆడవారు గర్భం ధరించే సామర్థ్యాన్ని మెరుగుపరిచే కొన్ని యోగాసనాలను ఆమె సూచించారు. ఈ ఆసనాలు మగవారికి కూడా ఉపయోగపడతాయి.
సంతాన 'యోగం' కోసం 5 భంగిమలు
ఈ 5 యోగా భంగిమలు స్త్రీ, పురుషుల్లో సహజంగా సంతాన సామర్థ్యాన్ని పెంచుతాయని అధ్యయనాలు వెల్లడించాయి.
1. బ్రిడ్జ్ పోజ్
- పెల్విస్‌కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
- వెన్నుకు బలాన్నిస్తుంది, కండరాలను గట్టిగా చేస్తుంది.
- స్పెర్మ్ కౌంట్ మొబిలిటీని పెంచుతుంది
2. కోబ్రా పోజ్
- ఊపిరితిత్తులు, ఛాతీని తెరుస్తుంది,
-పెల్విక్ ప్రాంతం, పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది
- వెన్నుకు బలాన్నిస్తుంది.
3. విపరీత కరణి
-హిప్, లోయర్ బ్యాక్ ప్రాంతాన్ని రిలాక్స్ చేస్తుంది
- ఫెలోపియన్ ట్యూబ్స్ తెరవడానికి అవకాశం ఇస్తుంది.
4. బటర్ ఫ్లై పోజ్
- లోపలి తొడ, పెల్విక్ ఫ్లోర్‌ను సాగదీస్తుంది
- పునరుత్పత్తి అవయవాలకు ప్రసరణను మెరుగుపరుస్తుంది
5. చైల్డ్ పోజ్
- వెన్నెముక, కటి ప్రాంతాన్ని రిలాక్స్ చేస్తుంది
- మీ మనస్సును రిలాక్స్ చేస్తుంది
- అండాశయాలను ఉత్తేజపరుస్తుంది.
ఇవి అత్యంత ప్రభావవంతమైన, సులభమైన యోగా భంగిమలు అని, ఈ యోగా భంగిమలు జంటల్లో ఇన్ఫెర్టిలిటీని తగ్గించి త్వరగా గర్భం దాల్చడానికి సహాయపడతాయని డాక్టర్ కవితా సింగ్ పేర్కొన్నారు.
సంబంధిత కథనం