ప్రపంచవ్యాప్తంగా వాడే ఆహారాల్లో కొబ్బరికాయలు ముఖ్యమైనవి. అన్నిదేశాల్లోనూ వీటి అవసరం ఎక్కువే. ఇవి మనకు చేసే మేలును గుర్తించే కొబ్బరి కాయల కోసం ప్రతి ఏడాది ఒక రోజును ప్రత్యేకంగా కేటాయించారు. ఏటా సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహించుకుంటారు. ఆసియన్ పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ కొబ్బరి కాయ దినోత్సవాన్ని ఏర్పరచింది.
మనదేశంలో ఏ చిన్న పూజ చేసినా కూడా కొబ్బరికాయ ఉండాల్సిందే. భారత్ లో కేరళ కొబ్బరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. రామాయణ, మహాభారతాలలో కూడా వీటి కొబ్బరి ప్రస్తావన ఉంది. కొబ్బరి మన ఆహారంలో భాగం కాకపోతే మనకు ఎన్నో పోషకాల అందవు. ఇవి రుచికరమైన ఆహారాన్ని అందించడంతో పాటూ, జుట్టు, చర్మం సౌందర్యాన్ని పెంచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొబ్బరి నూనెను తలకు ఎన్నో వందల ఏళ్లుగా ఉపయోగిస్తున్నాం.
పోషకాలతో నిండిన కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇనుము, మెగ్నీషియం, జింక్, రాగి, మాంగనీస్, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు అందుతాయి. ఎండిన, పచ్చి కొబ్బరితో తయారైన కొబ్బరి తురుములో 2 టేబుల్ స్పూన్లకు 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి వీలైనంతగా కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోండి.
కొబ్బరి నూనెను చర్మం, జుట్టుకు పూయడం ద్వారా తేమను కాపాడుకోవచ్చు. ఇది తేమను సమర్థవంతంగా లాక్ చేస్తుంది. పొడి చర్మం, పొడి జుట్టుకు చికిత్స చేస్తుంది. చర్మ వ్యాధైన తామరను నిర్వహించడానికి సహాయపడుతుంది.
కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకుంటే కేలరీల వినియోగాన్ని పెంచడానికి మీ పెరుగు లేదా ఓట్ మీల్ లో 2-3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు జోడించండి. అదనంగా, కొబ్బరిలోని మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (ఎంసిటి) మీ ఆకలిని తీర్చడానికి, కొవ్వును కరిగించేందుకు సహాయపడతాయి. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.
టాపిక్