World Brain Tumor day: బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వారసత్వంగా వస్తుందా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
World Brain Tumor day: బ్రెయిన్ ట్యూమర్ ఒక ప్రాణాంతక వ్యాధి. దీని గురించి అవగాహన పెంచడానికి, దానితో బాధపడుతున్న వారిని ఆదుకోవాలన్న పిలుపు ఇవ్వడానికి ఏటా జూన్ 8న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం నిర్వహించుకుంటారు.
అత్యంత ప్రమాదకరమైన మెదడు వ్యాధులలో బ్రెయిన్ ట్యూమర్ ఒకటి. మెదడులోని కణితులు మెదడు పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి. దీనివల్ల నడకలో ఇబ్బంది, స్వల్పకాలిక జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత పెట్టకపోవడం వంటి సమస్యలతో పాటూ అనేక నాడీ సమస్యలు వస్తాయి. మెదడులోని కణజాలాలు అసాధారణంగా పెరగుతాయి. ఆ కణాలు క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది. దీనికి చికిత్స చేయకపోతే మరణానికి దారితీసే అవకాశం ఉంది. క్యాన్సర్ కణితులకు తక్షణ చికిత్స అవసరం.
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు అవి వచ్చిన భాగాలను బట్టి మారవచ్చు. కణితి మెదడు మీద చురుకుగా లేని భాగాలలో ఎదిగితే, కణితి చాలా పెద్దదిగా పెరిగే వరకు లక్షణాలు కనిపించకపోవచ్చు. మెదడు కణితులు మెదడు కణజాలంలో పుట్టవచ్చు. అవి శరీరంలోని ఇతర భాగాలలో పుట్టినా కూడా అవి మెదడుకు వ్యాపించే అవకాశం ఉంది. దీన్ని మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్ అని కూడా పిలుస్తారు.
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు
మెదడులో కణితి పెరగడం వల్ల కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మూర్ఛలు రావడం, చేతులు లేదా కాళ్ళలో బలహీనత, తిమ్మిరి వంటివి కలగడం, నడుస్తున్నప్పుడు అసమతుల్యత, వినికిడి లోపం, ప్రవర్తనలో మార్పు, డబుల్ దృష్టి, జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా తలనొప్పి రావడం వంటివి కనిపిస్తాయి.
వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే 2024 ఎప్పుడు?
బ్రెయిన్ ట్యూమర్ బాధితులకు అవగాహన కల్పించడంలో, వారికి మద్దతు ఇచ్చేందుకు ఏటా జూన్ 8 ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డేను నిర్వహించుకుంటారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డేను 2000వ సంవత్సరంలో మొదలుపెట్టారు.
న్యూరోలాజికల్ లక్షణాలను నివారించడానికి మెదడు కణితిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. ప్రారంభ సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల సకాలంలో చికిత్స చేయించుకోవాలి. ముఖ్యంగా క్యాన్సర్ కణితులు ప్రాణాంతకం కాకముందే వాటిని వెంటనే పరిష్కరించాలి. ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, వ్యాధికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి, పరిశోధనలకు మద్దతు ఇవ్వడానికి ఈ ప్రత్యేక దినోత్సవం ఏర్పాటు చేశారు.
ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే 2024
ఈ ఏడాది థీమ్ 'బ్రెయిన్ ట్యూమర్ డే 2024' థీమ్ 'బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్'. మీ మెదడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ప్రమాద కారకాలను తొలగించడం వంటివి చేయాలి. బ్రెయిన్ ట్యూమర్ అనేది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అంటే తల్లి దండ్రులకు, తాతలకు ఉంటే వారి వారసులకు వచ్చే అవకాశం ఉంది. ధూమపానం చేసే వారిలో కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. రేడియేషన్ కు గురికావడం వల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్లు రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.
టాపిక్