God In Dreams : కలలో మీకు ఏ దేవుడు కనిపిస్తున్నాడు? అర్థాలేంటి?-what is the meaning if you see god in dreams know here for full details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  God In Dreams : కలలో మీకు ఏ దేవుడు కనిపిస్తున్నాడు? అర్థాలేంటి?

God In Dreams : కలలో మీకు ఏ దేవుడు కనిపిస్తున్నాడు? అర్థాలేంటి?

HT Telugu Desk HT Telugu
Sep 01, 2023 08:00 PM IST

God In Dream : కొంతమందికి కలలో దేవుడు కనిపిస్తాడు. ఒక్కో దేవుడు కనిపిస్తే.. ఒక్కో అర్థం ఉంటుంది. వాటి గురించి కంగారుపడాల్సిన పని లేదు. కొందరు దేవుడు కనిపిస్తే.. చాలా పవిత్రంగా భావిస్తారు. నిజానికి మంచిది కూడా. కానీ ప్రత్యేకంగా ఓ దేవుడు కనిపిస్తే.. దాని అర్థమేంటో తెలుసుకోవాలి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

కల.. అనేది మనిషి జీవితంలో సహజం. మనం ఎక్కువగా ఆలోచించే విషయం గురించే కల వస్తుంది. కొంతమంది ఈ కలలను సీరియస్ గా తీసుకుంటే.. మరికొందరు లైట్ తీసుకుంటారు. ఆధ్యాత్మిక భావం ఎక్కువ ఉన్నవాళ్లకు దేవుడికి సంబంధించిన కలలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇలా కనిపించడం వెనక కూడా ఓ అర్థం ఉంటుంది.

కలలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. గాఢ నిద్రలో కలలు కంటాం. వాటికి మన జీవితంతో ఏదో ఒక సంబంధం ఉంటుంది. నిద్రలో మనకు వచ్చే కలల వెనుక ఏదో అర్థం దాగి ఉంటుంది. దైనందిన జీవితంలో ఒక సంఘటన నుండి ప్రేరణ పొందడం ద్వారానో.. లేదా రాబోయే ఘటన గురించో కల వస్తుంది. అయితే కలలో దేవుళ్లను చూడటం చాలా అదృష్టంగా భావిస్తారు. కలలో ఏ దేవుణ్ణి చూడటం అంటే ఏంటో తెలుసా?

శ్రీమహావిష్ణువును ప్రపంచ పరిరక్షకుడు అంటారు. ఆయన కలలోకి రావడం మీ ప్రస్తుత పనిలో మీరు విజయం సాధిస్తారనే సందేశాన్ని ఇస్తుంది.

బ్రహ్మదేవుడు విశ్వ సృష్టికర్త. కలలో చూడడం వల్ల అదృష్టవంతులు అవుతారు. కలలో బ్రహ్మదేవుడు కనిపించడం అంటే జీవితంలో పురోగతి తలుపులు తెరవబోతున్నాయని అర్థం.

రాత్రి కలలో శ్రీ కృష్ణ భగవానుని చూడటం అంటే త్వరలో మీరు ప్రేమ విషయాలలో శుభవార్త అందుకోబోతున్నారు. అదృష్టాన్ని కూడా పొందుతారని అర్థం.

రాత్రి కలలో గణేశుడిని చూడటం వల్ల జీవితంలో వచ్చే సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయి. మీ పని పూర్తవుతుంది.

కలలో శ్రీరాముని చూడటం విజయాన్ని సూచిస్తుంది. అలాంటి కల రావడం ద్వారా అన్ని కష్టాలు ఉన్నప్పటికీ, మీరు విజయం సాధించబోతున్నారని చూపిస్తుంది.

కలలో దేవతలు రావడం కూడా మంచి ఫలితాలను సూచిస్తుంది. లక్ష్మీ దేవిని చూడటం జీవితంలో త్వరలో సంపద రాకను సూచిస్తుంది. కలలో సరస్వతిని చూడటం వల్ల ఉజ్వల భవిష్యత్తుకు అవకాశాలు పెరుగుతాయి. కలలో కాళీ దేవి రావడం ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది.

గమనిక : ఈ సమాచారం ప్రచారంలో ఉన్న ఊహలు, కథలపై ఆధారపడి ఉంది. HT Telugu ఈ కథనానికి సంబంధించిన ఏ ఇన్‌పుట్ లేదా సమాచారాన్ని ధృవీకరించదు. ఏదైనా సమాచారం, అంచనాలు, నమ్మకాలు అమలు చేసే ఆలోచనలో ఉంటే.. దయచేసి సంబంధిత నిపుణుల సలహాను తీసుకోండి.

WhatsApp channel