Beard Dandruff | గడ్డంలో చుండ్రు సమస్య.. మగవారు ఈ చికాకును తొలగించుకునే మార్గాలు!
Beard Dandruff: గడ్డం చుండ్రు అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది? గడ్డంలో చుండ్రును నివారించే మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.
Beard Dandruff: మగవారు గడ్డం పెంచుకోవడం ద్వారా వారి అందం, స్టైల్ మరింత పెరుగుతుంది. కానీ పెరిగిన గడ్డంతో వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. గడ్డంలో చుండ్రు పెరగటం అనేది కొందరిలో సమస్యగా ఉంటుంది. ఇది చాలా ఇబందికరమైన పరిస్థితి. తలలో చుండ్రును తొలగించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, మరి గడ్డంలో చుండ్రు పెరిగితే ఏం చేయాలి? అందుకు పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ తెలుసుకుందాం
గడ్డం చుండ్రు అగ్లీగా ఉంటుంది, గడ్డాన్ని తొలగించుకోవడం ద్వారా చుండ్రు పోతుంది. కానీ మీరు గడ్డం ఉంచుకోవాలనుకుంటే అందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ముందుగా గడ్డం చుండ్రు అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుందో నిపుణులు తెలియజేశారు.
హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఫరీదాబాద్‌లోని రివైవ్ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్ క్లినిక్‌లో డెర్మటాలజిస్ట్ అయిన డాక్టర్ సందీప్ బబ్బర్ మాట్లాడుతూ.. చర్మం పొరలుగా విడిపోవడం వలన చుండ్రు సమస్య వస్తుందని తెలిపారు. గడ్డం చుండ్రును వైద్య భాషలో సెబోరోహెయిక్ డెర్మటైటిస్ అంటారు. సరైన పరిశుభ్రత పాటించకపోవడం వలన ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇది గడ్డంలో చికాకును కలిగించడమే కాకుండా, అందాన్ని దెబ్బతీస్తుంది.
మృతకణాలను తొలగించండి
గడ్డంలో చుండ్రుని తొలగించుకోవడానికి కొన్ని దశలు ఉంటాయి. ఇందులో భాగంగా గడ్డం బ్రష్‌ని ఉపయోగించి, మృతకణాలను తొలగించాలి. గడ్డంలోని వెంట్రుకల చిక్కుముడులను విడదీయాలి. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి ప్రతిరోజూ గడ్డం బ్రష్‌ను ఉపయోగించండి. ఆ తర్వాత కడగడం మర్చిపోవద్దు.
ప్రతిరోజూ శుభ్రపరచండి
మీరు ప్రతిరోజూ గడ్డాన్ని బ్రష్ చేయండి, మీరు మీ రోజువారీ దినచర్యలో గడ్డాన్ని శుభ్రపరచడాన్ని కూడా చేర్చాలి. స్నానం చేసి, మీ గడ్డం, మొత్తం ముఖానికి మంచి క్లెన్సర్‌ని వర్తించండి.
బేర్డ్ ఆయిల్ అప్లై చేయండి
మీ గడ్డాన్ని హైడ్రేట్ చేయడానికి మాయిశ్చరైజర్‌ని ఉపయోగించడం లేదా ఫినిషర్‌గా మెరుగ్గా పనిచేసే అధిక-నాణ్యత గల గడ్డం ఆయిల్ వర్తించాలి. ఎక్కువ నూనె వాడకుండా రెండు మూడు చుక్కలు అప్లై చేయాలి. ఒకవేళ మీకు పొడవైన గడ్డం ఉంటే అందుకు సరిపడా మరికొంత నూనెను వర్తించాలి. మీరు ఈ రొటీన్‌ని ప్రతిరోజూ అనుసరించడం ద్వారా గడ్డం చుండ్రు కనుమరుగవుతుంది.
గడ్డం చుండ్రు పునరావృతం కాకుండా ఎలా నిరోధించాలి?
గడ్డం చుండ్రును తొలగించిన తర్వాత కూడా మళ్లీ కొన్ని రోజులకు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్లీ అలా జరగకుండా సరైన శుభ్రత పాటించాలి. గడ్డం చుండ్రు రాకుండా నిరోధించడానికి పైన పేర్కొన్న మూడు-దశల ప్రక్రియను అనుసరించడం చాలా ముఖ్యం.
సంబంధిత కథనం