Weight Gain Tips: బరువు పెరగాలంటే పిజ్జాలు, బర్గర్లే కాదు.. పండ్లు కూడా తినొచ్చు..
కొందరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే.. మరికొందరు బరువు పెరగాలని ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గడానికి చాలా మంది ఫ్రూట్స్ తింటారు. అయితే బరువు పెరగడానికి కూడా ఫ్రూట్స్ తినవచ్చని మీకు తెలుసా? అవునండి.. కొన్ని ఫ్రూట్స్ తింటే మీరు సహజంగా బరువు పెరగవచ్చు అంటున్నారు ఆహార నిపుణులు. మరి ఆ ఫ్రూట్స్ ఏంటో మీరు ఓ లుక్కేయండి.
Weight Gain Tips: మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎందుకు జంక్ ఫుడ్ జోలికి వెళ్లడం. సహజంగా, ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడం మంచిదే కదా. పండ్లు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి అనుకుంటే అది అపోహే అవుతుంది. ఎందుకంటే కొన్ని పండ్లు మీరు సహజంగా, ఆరోగ్యంగా బరువు పెరిగేలా చేస్తాయి. ఇవి సహజంగా బరువు పెరగడానికి మీకు సహాయపడే కేలరీలు, అవసరమైన ఖనిజాలు అందిస్తాయి. మరి ఆ పండ్లు ఏమిటో మీరు తెలుసుకుని.. బరువు పెరిగిపోండి.
అరటిపండ్లు
అరటిపండ్లు పూర్తిగా పోషకవిలువలతో నిండి ఉంటాయి. మీరు సహజ పద్ధతిలో బరువు పెరగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. అరటిపండ్లు మీ ఆహారంలో చేర్చుకోవడానికి సరైన ఎంపిక. పొటాషియం, మెగ్నీషియం, పిండి పదార్థాలు, విటమిన్ B6, ఫైబర్, ఎలక్ట్రోలైట్స్, ప్రొటీన్‌లతో నిండిన ఈ అధిక కేలరీల పండు కండరాల తిమ్మిరి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకే చాలామంది వాటిని వ్యాయామ అనంతర చిరుతిండిగా తీసుకుంటారు. ఒక సగటు అరటిపండులో దాదాపు 119 కేలరీలు ఉంటాయి. కాబట్టి మీరు వాటిని స్మూతీస్, ఓట్స్‌తో కలిపి తీసుకోవచ్చు.
మామిడి
రాగి, విటమిన్లు ఎ, బి, ఇ వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన మామిడి అధిక కేలరీల పండు. ఇది మంచి మొత్తంలో పిండి పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది బరువు పెరగడానికి సరైనది. ఇందులో ఫ్రక్టోజ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా అధిక కేలరీలను అందిస్తుంది. ఒక కప్పు మామిడి పండ్లలో దాదాపు 99 కేలరీలు ఉంటాయి. సహజంగా బరువు పెరగడానికి మీరు మామిడి పండ్లను సలాడ్లు, పెరుగు లేదా స్మూతీలతో కలిపి తీసుకోవచ్చు.
అవకాడోస్
అవకాడోలు ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. చాలా ఆరోగ్యకరమైన కొవ్వులు, డైటరీ ఫైబర్, అవసరమైన పోషకాలతో నిండిన అవోకాడో మీ బరువు పెరిగే ప్రయాణంలో సహాయపడే ఒక అన్యదేశ పండు. ఇది విటమిన్లు, ఖనిజాలు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అనేక సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఒక మధ్య తరహా అవోకాడోలో దాదాపు 162 కేలరీలు ఉంటాయి. మీరు అవోకాడోలను స్మూతీస్ లేదా మిల్క్‌షేక్‌లతో తీసుకోవచ్చు. లేదా ఉదయం అల్పాహారంగా అవోకాడో టోస్ట్ తీసుకోవచ్చు.
కొబ్బరి
అధిక కొవ్వు, మంచి మొత్తంలో పిండి పదార్ధాలతో లోడ్ చేయబడిన కొబ్బరి గుజ్జు సహజంగా బరువు పెరగడానికి మీకు సహాయపడటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో భాస్వరం, రాగి పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఎముకలకు అద్భుతమైనవి. ఒక కప్పు తురిమిన కొబ్బరిలో 283 కేలరీలు ఉంటాయి. క్యాలరీ కంటెంట్‌ను పెంచడానికి మీరు వాటిని ఫ్రూట్ సలాడ్‌లు, స్టైర్-ఫ్రైస్, స్మూతీలలో కలిపి సేవించవచ్చు.
ఖర్జూరం
అధిక కేలరీలు కలిగిన సూపర్‌ఫుడ్ ఖర్జూరం. దీనిలో రాగి, మాంగనీస్, విటమిన్ B6, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి ఉత్తమమైన పండ్లలో ఒకటి. ఈ అధిక శక్తి కలిగిన పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయి. 100 గ్రాముల ఖర్జూరంలో 277 కేలరీలు ఉంటాయి. మీరు ఆరోగ్యకరమైన, ప్రోటీన్-ప్యాక్డ్, అధిక కేలరీల అల్పాహారం తినాలి అనుకుంటే.. కొబ్బరి తురుముని.. బాదం, ఖర్జూరంతో కలిపి తీసుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్