Wednesday Motivation : జీవితంలో ఆ ఒక్కటి వదిలిస్తే చాలు.. సకెస్స్ మీదే..-wednesday motivation on if you are going to quit anything quit being lazy quit making excuses ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : జీవితంలో ఆ ఒక్కటి వదిలిస్తే చాలు.. సకెస్స్ మీదే..

Wednesday Motivation : జీవితంలో ఆ ఒక్కటి వదిలిస్తే చాలు.. సకెస్స్ మీదే..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 07, 2022 06:15 AM IST

Wednesday Motivation : మీరు మీ జీవితంలో ఏదైనా విడిచిపెట్టాలి అనుకుంటున్నారా? అయితే మీ సోమరితనాన్ని.. సాకులు చెప్పడాన్ని.. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పే మాటాలను వదిలేయండి. వీటిని మీరు వదిలేస్తే.. మీ జీవితంలో మీరు చాలా సక్సెస్ అవుతారు.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : చాలామంది మందు తాగడం, సిగరెట్లు కాల్చడం, తిరగడం వంటివి చెడు అలవాట్లు అనుకుంటారు కానీ.. జీవితంలో అసలైన చెడు అలవాటు సోమరితనమే. ఈ సోమరితనం మనిషిని ఎప్పుడూ గెలవనివ్వదు. పైగా రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నాను వంటి సాకులు చెప్పేలా చేస్తుంది. ఇది మీతో ఉంటే ఎప్పటికీ మీరు జీవితంలో విజయాన్ని చవి చూడలేరు. అసలు సోమరితనమే అన్ని విఘ్నాలకు ముఖ్య కారణం. అన్ని అలవాట్ల కన్నా ముందు దీనిని వదులుకుంటే చాలు. మీరు కచ్చితంగా సక్సెస్ అవుతారు.

కొంతమంది పని చేయడం ఇష్టంలేక.. లేదా పని చేయాలని.. కష్టపడాలనే తపన లేక.. ఏదొక సిల్లీ రీజన్ చెప్తూ.. ఉద్యోగాలు మానేస్తున్నామని.. లేదా తమ గోల్​ని విరమించుకుంటున్నామని.. అడ్డమైన కారణాలు చెప్తారు. ఇలాంటి సమయంలో మీరు చేయాల్సిందల్లా.. జాబ్​ని వదులుకోవడం, గోల్​ వదులుకోవడం కాదు. మీలోని సోమరితనాన్ని వదిలేస్తే.. మీరు సక్సెస్ అవుతారు. అంతేకాదండోయ్.. మీకు పని చేయాలన్నా ఉత్సాహం కూడా మరింత పెరుగుతుంది.

మీరు ఏదైనా వదిలేయాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఆ నిర్ణయం ఎంత వరకు కరెక్ట్ అని ఆలోచించుకోండి. దానివల్ల మీకు కలిగే ఫలితాలు ఏంటి అని ప్రశ్నించుకోండి. మీ బద్ధకంతో దేనినైనా వదిలేస్తున్నట్లయితే.. ఆ నిర్ణయాన్ని అప్పుడే విరమించుకుని.. మీ సోమరితనాన్ని వదిలేయండి. మీ సోమరితనమే.. మిమ్మల్ని జీవితంలో పైకి ఎదగకుండా ఆపేస్తుందని మీరు గుర్తిస్తే.. మీరు ఎప్పటికీ దేనిని వదులుకోరు. మీ ముందున్న అవకాశాలను మీ సోమరితనంతో వదిలేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. నేను ఇప్పుడు చేయను.. కరెక్ట్ టైమ్ వస్తుంది అనుకుంటూ వెయిట్ చేస్తే.. టైం వేస్ట్ అవుతుంది తప్పా.. కొంచెం కూడా కలిసిరాదు. ఒకవేళ అలా కలిసి వచ్చిందంటే అది లక్​ తప్పా.. మీ కష్టం కాదు.

మన కష్టం కానిది మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి కష్టపడండి. అది ఈరోజు కాకపోయినా రేపు అయినా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. మానసికంగా, శారీరకంగా కూడా మీరు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది. మీ చేతిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోండి. అంతేకానీ సోమరితనంతో వాటిని దూరం చేసుకోకండి. మీరు ఎంత ఉల్లాసంగా ఉంటే.. మీ పనులు అంత త్వరగా పూర్తవుతాయి. మీరు ఎంత నీరసంగా, డల్​గా, సోమరితనంతో ఉంటే.. మీ పనులు కూడా అంత నత్తనడకన సాగుతాయి.

కాబట్టి మీరే చేసే పనిలో ఎప్పుడూ నిజాయితీగా.. మీ ఎఫర్ట్స్ పెట్టి చేయండి. మీరు బద్ధకాన్ని వదిలి పనులు చేసుకుంటే.. ఏ పని అయినా మీకు కష్టంగా అనిపించదని గుర్తించుకోండి. మీరు సాకులు వెతుక్కుంటూ.. టైంపాస్ చేస్తే మాత్రం ఆ దేవుడు కూడా మీకు హెల్ప్ చేయలేడు. కాస్త బ్రేక్ తీసుకుని మొదలుపెడదామని చూస్తే.. మీరు ఎప్పుడూ ఆ పనిని వేగంగా కంప్లీట్ చేయలేరు. చిన్న చిన్న బ్రేక్​లు కాస్తా.. పెద్ద గ్యాప్​గా మారకుండా చూసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం