Vinayaka Chavithi Wishes 2024: ఓం వినాయకాయ నమః, మీ బంధుమిత్రులకు తెలుగులోనే వినాయక చవితి శుభాకాంక్షలు ఇవిగో-vinayaka chavithi wishes 2024 in telugu for massages and whatapp status ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vinayaka Chavithi Wishes 2024: ఓం వినాయకాయ నమః, మీ బంధుమిత్రులకు తెలుగులోనే వినాయక చవితి శుభాకాంక్షలు ఇవిగో

Vinayaka Chavithi Wishes 2024: ఓం వినాయకాయ నమః, మీ బంధుమిత్రులకు తెలుగులోనే వినాయక చవితి శుభాకాంక్షలు ఇవిగో

Haritha Chappa HT Telugu
Sep 07, 2024 06:00 AM IST

Vinayaka Chavithi Wishes 2024: వినాయక చవితికి మీ బంధుమిత్రులకు పంపించేందుకు శుభాకాంక్షలు మెసేజ్‌ల కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము కొన్ని అందమైన మనసుకు హత్తుకునే మెసేజ్‌లను ఇచ్చాము. వీటిని వాట్సాప్, మెసేజ్‌లు, సోషల్ మీడియాలో షేర్ చేసుకోండి.

వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు (Pexel)

Vinayaka Chavithi Wishes 2024: విఘ్నాలను తొలగించే గణపయ్యకు చేసే మొదటి పూజతోనే ప్రతి పండుగ మొదలవుతుంది. ఏ వేడుకైనా మొదటి వందనం అందుకునేది గణేశుడు. మన భారత దేశంలో వినాయక చతుర్థి వాడ వాడలా వేడుకగా జరుగుతుంది. ప్రతి వీధిలో వినాయక మండపాలు కొలుపు తీరాల్సిందే. వినాయక చవితి రోజు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఇక్కడ తెలుగులో కొన్ని మెసేజ్‌లు ఇచ్చాము. ఇవన్నీ మనసును హత్తుకునే కొటేషన్లు. వీటిని వాట్సా‌ప్, మెసేజ్‌లు, సోషల్ మీడియాలో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు.

వినాయక చవితి శుభాకాంక్షలు

1. బుద్ధి, ఐశ్వర్యం, తెలివితేటలు

విజయం, ఆనందం ...

ఇవన్నీ కూడా వినాయకుడు

మీకు మీ కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుంటూ

వినాయక చవితి శుభాకాంక్షలు

2. వినాయకుడు మీ జీవితాల్ని

ఆనందమయం చేయాలని

మీ కుటుంబంలో ప్రేమా,

ఆప్యాయతలను నింపాలని కోరుకుంటూ

హ్యాపీ వినాయక చవితి

3. నేటి వినాయక చవితి పూజతో

మీకు దీర్ఘాయుష్షు కలగాలని

ఐశ్వర్యం పొందాలని ప్రార్థిస్తూ

గణేష్ చతుర్థి శుభాకాంక్షలు

4. ఏ పని మొదలుపెట్టినా

అది విజయవంతం అయ్యేలా

ఆ వినాయకుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ

మీకు మీ కుటుంబ సభ్యులకు

హ్యాపీ వినాయక చవితి

5. మీ ఇంట్లో నేగెటివిటీని పోగొట్టి

సంతోషాన్ని, సందడిని గణేషుడు పెంచాలని

ఆయన అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటూ

హ్యాపీ వినాయక చవితి

6. ఓం గణ గణపతయే నమో నమః

శ్రీ సిద్ధి వినాయక నమో నమః

అష్ట వినాయక నమో నమః

గణపతి బొప్పా మోరియా

హ్యాపీ వినాయక చవితి

7. మీరు చేసే ప్రతి కార్యం

గణేశుడి ఆశీస్సులతో

విజయం చేకూరాలని కోరుకుంటూ

హ్యాపీ వినాయక చవితి

8. గణనాథుడు మిమ్మల్ని అన్ని సమయాల్లో రక్షించాలి.

మీరు ఏ పని మొదలుపెట్టిన అది విజయవంతం అవ్వాలి.

ఆ మహాగణపతిని పూజిస్తూ

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

9. అగజానన పద్మార్కం

గజాననమ్ అహర్నిశం

అనేక దంతం భక్తానాం

ఏకదంతం ఉపాస్మహే

వినాయక చవితి శుభాకాంక్షలు

10. గణేష్ భగవానుని పవిత్ర పండగను

ఆనందంగా, భక్తితో నిర్వహించుకుంటారని ఆశిస్తూ

ఆ గణేశుడు ఆశీస్సులు

మీ జీవితంలో వెలుగుల నింపాలని కోరుకుంటున్నాను

హ్యాపీ వినాయక చవితి

11. మీ కలలను నిజం చేసే అవకాశాలను

ఆ గణేశుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ

వినాయక చతుర్థి శుభాకాంక్షలు

12. ఈ వినాయక చవితి నుంచి

మీ జీవితం విజయవంతంగా,

సంపన్నంగా నడవాలని ఆశిస్తూ

హ్యాపీ వినాయక చవితి

13. ఈ వినాయక చతుర్థి

మీ జీవితంలో కొత్త ప్రారంభాలను

కొత్త ఉత్సాహాన్ని, కొత్త అవకాశాలను

ఇవ్వాలని కోరుకుంటూ

వినాయక చవితి శుభాకాంక్షలు

14. గణేశుని ఆశీస్సులతో

మీ కుటుంబంలో ప్రేమ, శాంతి

నెలకొనాలని కోరుకుంటూ

హ్యాపీ వినాయక చవితి