valentine week 2024: వాలెంటైన్స్ డే వీక్‌లో ప్రతిరోజూ మీ భాగస్వామిని ఇలా సర్‌‌‌ప్రైజ్ చేయండి, ఏ రోజు ఏం చేయాలంటే…-valentine week 2024 surprise your partner every day during valentines day week ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valentine Week 2024: వాలెంటైన్స్ డే వీక్‌లో ప్రతిరోజూ మీ భాగస్వామిని ఇలా సర్‌‌‌ప్రైజ్ చేయండి, ఏ రోజు ఏం చేయాలంటే…

valentine week 2024: వాలెంటైన్స్ డే వీక్‌లో ప్రతిరోజూ మీ భాగస్వామిని ఇలా సర్‌‌‌ప్రైజ్ చేయండి, ఏ రోజు ఏం చేయాలంటే…

Haritha Chappa HT Telugu
Feb 06, 2024 11:48 AM IST

వాలెంటైన్స్ వీక్ వచ్చేస్తోంది. ప్రేమలో జీవితభాగస్వామిని ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రతిరోజు కొత్తగా సర్ ప్రైజ్ చేస్తే ఆ కిక్కే వేరు. రోజ్ డే, కిస్ డే, ప్రపోజ్ డే, హగ్ డే… ఇలా ఎనిమిది రోజుల పాటూ పెద్ద పండగే.

వాలెంటైన్స్ డే
వాలెంటైన్స్ డే (Freepik)

ఫిబ్రవరి నెల వచ్చిందంటే ప్రేమ మాసం వచ్చినట్టే. ప్రేమ పక్షులకు చాలా ఇష్టమైన నెల ఫిబ్రవరి. వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న వచ్చినప్పటికీ, దానికి ముందు వారం రోజుల పాటూ చాలా ప్రాముఖ్యత ఉంది. వాలెంటైన్స్ వీక్ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. రోజ్ డే (ఫిబ్రవరి 7), ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8), చాక్లెట్ డే (ఫిబ్రవరి 9), టెడ్డీ డే (ఫిబ్రవరి 10), ప్రామిస్ డే (ఫిబ్రవరి 11), హగ్ డే (ఫిబ్రవరి 12), కిస్ డే (ఫిబ్రవరి 13) … ఈ రోజులన్నీ వాలెంటైన్స్ డేను మరింత రంగుల మయం చేస్తాయి. ఈ సమయంలో మీ ప్రియమైనవారికి బహుమతులతో సర్ ప్రైజ్ చేయండి. దీనికోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఏదేమైనా, మీ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిని ఎలా సర్ ప్రైజ్ చేయాలని ఆలోచిస్తున్నారా? వారిని ఆకర్షించడానికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వీటిని ఫాలో అవ్వండి.

రోజ్ డే

వాలెంటైన్స్ వీక్ లోని మొదటి రోజు రోజ్ డే. ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున మీ భాగస్వామికి గులాబీల బొకేతో సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఆ పువ్వులను గుర్తుగా దాచి ఉంచి ఎండిపోయాక ఆ గులాబీలను లేదా గులాబీ రేకులను అందమైన ఫ్రేమ్ లు తయారు చేయవచ్చు. లేదా గాజు సీసాలో వేసి ఉంచి వాటిని లివింగ్ రూమ్ లో అందంగా కనిపించేలా పెట్టవచ్చు. ఎప్పుడూ గులాబీలను కొని ఇవ్వడమే రొటీన్ అనిపిస్తే ఓసారి ఒరిగామి పద్ధతిలో మీ చేత్తోనే ఎర్రటి గులాబీలను తయారుచేసి బొకేలా మార్చి ఇవ్వండి. ఇవి ఎన్నిరోజులైనా చెక్కు చెదరకుండా ఉంటాయి.

ప్రపోజ్ డే

మీ ప్రేమను తెలియజేసేందుకు ప్రపోజ్ డేను వినియోగించుకోండి. ఈరోజు చాలా స్పెషల్ గా వారికి మీ మనసులోని మాటలను చెప్పండి. మీరు వారికి ఇష్టమైన రెస్టారెంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్‌కు తీసుకెళ్లవచ్చు. ఆమె చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఉండేలా చూడండి. బెలూన్లు, కొవ్వొత్తులు, పువ్వులతో అలంకరించండి.

చాక్లెట్ డే

చాక్లెట్ డే అనగానే షాపులో ఓ చాక్లెట్ కొని ఇచ్చేస్తారు. ఇది చాలా రొటీన్. దీనికి బదులు మీ ప్రేయసితో కలిసి చాక్లెట్లు తయారు చేయడం, లేదా చాక్లెట్ల తయారీ క్లాసుకు ఓ రెండు గంటల పాటూ హాజరవ్వడం చేస్తే చాలా బాగుంటుంది. ఇద్దరూ కలిసి చాక్లెట్ తయారీని నేర్చుకోవచ్చు. చాక్లెట్లు, స్వీట్లు, కేకుల తయారీ ఇద్దరూ కలిసి నేర్చుకుని… ఇంట్లో ఆ వంటకాన్ని తయారు చేసి ఒకరికొకరు తినిపించుకుంటే ఆ కిక్కే వేరు.

టెడ్డీ డే

టెడ్డీ బేర్‌లంటే ఎంతో మంది ఇష్టం. ఇది ప్రేమను తనతోనే మోసుకెళ్లి మీ భాగస్వామికి అందజేస్తుంది. మృదువుగా, ముద్దుగా ఉండే టెడ్డీబేర్ ను బహుమతిగా ఎప్పుడూ బావుంటుంది. టెడ్డీ బేర్ హత్తుకోగానే హాయిగా ఉంటుంది. ఓదార్పుగా, ప్రేమగా అనిపిస్తుంది. జంట టెడ్డీ బేర్‌ను ఓసారి గిఫ్టుగా ఇవ్వండి. అలాగే టెడ్డీ డేర్ కస్టమైజ్ చేయించి, ఆమెకు నచ్చే రీతిలో తయారుచేయించండి. టెడ్డీ బేర్ పై మీ ఇద్దరి ఫోటో ఉండేలా చూసుకోండి. ఇది జీవితాంతం గుర్తుండిపోయే బహుమతిగా మారిపోతుంది.

ప్రామిస్ డే

ప్రామిస్ డే… జంట కలిసిన మీరిద్దరూ మంచి భవిష్యత్తు కోసం ఒకరికొకరు వాగ్దానాలు చేసుకునే రోజు. ఈ రోజున భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారో, జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలనుకుంటున్నారో ఓసారి ఇద్దరూ చర్చించుకోండి. ఈ రోజున మీరు కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న ఫోటోలను ఆల్బమ్ రూపంలో మార్చి, వారికి బహుమతిగా ఇవ్వండి.

హగ్ డే

ప్రేమను, ఆప్యాయతను చూపించడానికి మీ భాగస్వామిని వెచ్చగా కౌగిలించుకోండి. ఆ కౌగిలింతో మీ ప్రేమ వారికి తెలియాలి. కౌగిలింత అనేది ప్రేమ, ఓదార్పును అందిస్తుంది. హగ్ డే రోజు ఓ అందమైన ప్రదేశానికి వెళ్లి అక్కడ మీ క్రష్ ను కౌగిలించుకోండి. అలాగే ఓ మూవీకో, రెస్టారెంట్ కో వెళ్లి రండి.

కిస్ డే

మీరు ఎంతగా మీ భాగస్వామిని ప్రేమిస్తున్నారో తెలియజెప్పేందుకు కిస్ డే ప్రత్యేకమైనది. మీ ప్రేమ వారికి తెలిసేలా ఒక అందమైన కవితను రాయండి. ఆ కాగితం మీ హృదయపూర్వక సందేశాన్ని రాయండి.

Whats_app_banner