Tuesday Motivation : బ్రేకప్ అయితే లైట్ తీసుకోండి బాస్.. అదే మీ విజయానికి తొలిమెట్టు
Tuesday Motivation In Telugu : ప్రేమలో విడిపోతే చాలా మంది చేసే తప్పు కుమిలి కుమిలి ఏడ్వడం. బ్రేకప్ అయితే మీ లైఫ్ బాగుపడుతుందని గుర్తించాలి.
విడిపోవడం అనే పదం వినగానే మీకు నిరాశ, విచారం, హృదయం బరువెక్కినట్టుగా ఉండటం సహజం. కానీ విడిపోడవం అనేది కూడా ఒక రకమైన అనుభవం. మిమ్మల్ని విడిపోయేవారు ఎందుకు దూరం చేసుకున్నారు అనే ప్రశ్నలు వేసుకోవాలి. దాదాపుగా ప్రతీ బంధంలో విడిపోవడానికి డబ్బు, ప్రేమ తక్కువ చూపించడం ముఖ్యమైన కారణాలుగా ఉంటాయి. అయితే విడిపోవడం వలన బాధ మాత్రమే కాదు.. కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. విడిపోవడం కొత్త పరిచయాలకు నాంది పలుకుతుంది. వ్యక్తిగత వృద్ధికి దారి తీస్తుంది. విడిపోయిన మెుదట్లో బాధ సహజమే. కానీ తర్వాత జీవితంలో కొన్ని సానుకూల విషయాలు జరుగుతాయి. అయితే ఇందుకోసం మీ ఆలోచన విధానం మారాలి. అప్పుడే జిందగీలో బాగుపడతారు.
విడిపోవడం ప్రభావంత మీ గురించి మీరు అంచనా వేయడం ప్రారంభించుకోవాలి. వ్యక్తులతో ఎలా ఉండాలో మీకో ఐడియా రావాలి. సంబంధాలను అంచనా వేయడం మెుదలుపెడతారు. ఇది తమను తాము మంచి మార్గంలో తిరిగి ఆవిష్కరించుకునేలా చేస్తుంది. ప్రేమ, దాని ఇతర చిక్కుల నుండి విముక్తి పొంది స్వంత లక్ష్యాలు, కలలు, కోరికలకు ఎక్కువ సమయం, శ్రద్ధను కేటాయించగలుగుతారు. ఇది లోతైన స్వీయ-అవగాహన ద్వారా వ్యక్తిగత వృద్ధికి దారితీస్తుంది.
విడిపోయిన తర్వాత మరింత స్వతంత్రంగా మారతారు. ఒంటరిగా, స్వాతంత్ర్యం, స్వయం సమృద్ధిని తిరిగి పొందగలరు. మీ కోసం మీ ఆనందాన్ని కనుగొనడం కూడా నేర్చుకుంటారు. స్వంత వ్యవహారాలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మిమ్మల్ని మరింత బలంగా చేస్తుంది. ఇది తరువాతి జీవితంలోని పరీక్షలను మెరుగ్గా ఎదుర్కొనేందుకు శక్తినిస్తుంది.
జీవితంలో సంక్షోభం సమయంలో మనకు మద్దతుగా ఎవరు ఉన్నారు అనేది గుర్తిస్తారు. ఎవరు మనవారు.. ఎవరు పరాయివారు అనేది మీకు అర్థమవుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతుతో మీకు వారితో మంచి రిలేషన్ ఏర్పడుతుంది. ఇటువంటి అర్ధవంతమైన సంబంధాలు వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేస్తాయి. ప్రత్యేకమైన భావోద్వేగ భద్రతను అందిస్తాయి. అంతేకాదు మీతో ఎవరు ఉంటారు అనేది మీకు ఆ విషయంలోనే అర్థమవుతుంది.
విడిపోవడం అనేది జీవితంలో ఒక అధ్యాయానికి ముగింపు, మరొక అధ్యాయానికి నాంది అని గ్రహించండి. ఇది కొత్త అవకాశాలు, సంబంధాలకు తలుపులు తెరవడంలాంటిది. ఓపెన్ హార్ట్ తో అన్నింటిని అంగీకరించాలి. బ్రేకప్ అయిన కాలాన్ని మీరు దాటాలి అంతే. మీ జీవితాన్ని సంతోషకరమైన, ఊహించని అనుభవాలుగా మార్చుకోండి. గతాన్ని వదిలేయండి.. ముందుకు వచ్చే అవకాశాల కోసం అడుగులు వేయండి.
బ్రేకప్ బాధ మహా అయితే.. నెల రోజులు ఉంటుంది.. కానీ జీవితంలో మీరు సాధించే విజయం.. జీవితాంతం కిక్కునిస్తుంది. మిమ్మల్ని వదిలివెళ్లినవారికి మీ సక్సెస్‌తో సమాధానం చెప్పడమే అసలు విజయం. బ్రేకప్ అయిందని బాధలో ఉండిపోక.. లేచి పరిగెత్తాలి. లేదంటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నవారు అవుతారు.
ప్రపంచంలో విడిపోయిన ప్రేమలు అన్ని గొప్పవే. మీ ప్రేమ కూడా గొప్పదే అని ముందుకైనా సాగాలి. లేదంటే అక్కడే ఆగిపోతారు. ఆగిపోతే.. జీవితం సాగదు. జీవితంలోకి మనుషులు వస్తుంటారు.. పోతుంటారు.. మీకు నచ్చినట్టుగా బతికితేనే లైఫ్ హ్యాపీ..