Orange and Ginger Detox Drink : డిటాక్స్ డ్రింక్స్ అనేవి హెల్త్‌ని కాపాడుతాయి. ఇవి శరీరంలోని మళినాలను బయటకు పంపి.. రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. కాబట్టి డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. పైగా డిటాక్స్ డ్రింక్స్ వల్ల శరీరంలోని చెడు కొవ్వు తొలగిపోతుంది. అయితే మీరు డిటాక్స్ డ్రింక్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వాటిలో ఒకటి ఆరెంజ్, అల్లం డిటాక్స్ డ్రింక్. పైగా దీనిలో పసుపు కూడా వేస్తాం కాబట్టి.. వ్యాయామం తర్వాత వచ్చే బోన్స్ పెయిన్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి జిమ్ చేసి వచ్చాక కూడా ఈ డ్రింక్ తాగవచ్చు. ఇవే కాదండోయ్ వీటితో చాలా ఉపయోగాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.,కావాల్సిన పదార్థాలు* క్యారెట్ - 1 పెద్దది,* నారింజ - 2,* పచ్చి పసుపు - అర అంగుళం.. లేదా పసుపు - అర స్పూన్,* అల్లం - అర అంగుళం,* నిమ్మకాయ - సగం,తయారీ విధానంఆరెంజ్ జ్యూస్ తీసి పెట్టుకోవాలి. క్యారెట్‌ను కూడా విడిగా మిక్సీ చేసుకోవాలి. వీటిని బ్లెండర్‌లో వేసి.. పసుపు, అల్లం వేసి.. బాగా బ్లెండ్ చేయాలి. దానిలో సగం నిమ్మకాయను పిండాలి. ఇప్పుడు వడకట్టాలి. దీనిని పరగడుపునే తీసుకుంటే.. మీ శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకి వచ్చేస్తాయి. పైగా మీ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ,