Detox Drinks | వేసవిలో డిటాక్స్ డ్రింక్స్ తీసుకోండి.. ఆరోగ్యానికి చాలా మంచిది..-summer special detox drinks for good health ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Summer Special Detox Drinks For Good Health

Detox Drinks | వేసవిలో డిటాక్స్ డ్రింక్స్ తీసుకోండి.. ఆరోగ్యానికి చాలా మంచిది..

HT Telugu Desk HT Telugu
May 24, 2022 01:56 PM IST

వేసవిలో కూల్ డ్రింక్స్ తాగేందుకు ఎక్కువ ఇష్టపడతాము. అవి మంచి రుచి ఇచ్చి.. ఆ క్షణానికి మంచి అనుభూతినిస్తాయి. కానీ శరీరానికి హాని కలిగిస్తాయి. శరీరంలో టాక్సిన్ స్థాయిలను పెంచుతాయి. అందుకే నిపుణులు డిటాక్స్ డ్రింక్స్ తాగాలని సూచిస్తున్నారు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో.. అవి మనకు ఏవిధంగా సహాయం చేస్తాయో తెలుసుకుందాం.d

డిటాక్స్ డ్రింక్స్
డిటాక్స్ డ్రింక్స్

Detox Drinks | శరీరంలో మలినాలు, వ్యర్థాలు ఎక్కువైపోతే రకరకాల సమస్యలు ఏర్పడతాయి. పైగా వేసవిలో మలబద్దకం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అందుకే శరీరం నుండి టాక్సిన్​లను బయటకు పంపించేయాలి. టాక్సిన్​లను బయటకు పంపిచడానికి కొన్ని డిటాక్స్ డ్రింక్స్ సహాయం చేస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇంతకీ డిటాక్స్ డ్రింక్స్ ఏంటో.. వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

డిటాక్స్ వాటర్

నిమ్మ, పుదీనా, పైనాపిల్ వంటి వాటితో.. డిటాక్స్ వాటర్​ను తయారు చేసుకుని.. మీ రోజును ప్రారంభించవచ్చు. ఒక జాడీ నీటిలో నిమ్మకాయ ముక్కలు, కీర దోస ముక్కలు, పైనాపిల్ ముక్కలు, పుదీనా ఆకులు, అల్లం ముక్కలు వేయాలి. ఈ పదార్థాలన్నీ అరగంట నాననివ్వాలి. అరగంట తర్వాత ఇది తాగడానికి రెడీ అయినట్లే. మీరు రోజంతా ఈ నీటిని తాగొచ్చు.

కొబ్బరి నీరు

మీ కడుపు ఉబ్బినట్లుగా అనిపిస్తే.. కొబ్బరి నీరు మీకు సహాయం చేస్తుంది. దీనిలో పొటాషియం ఉంటుంది. కొబ్బరి నీరు పొట్టలో తేలికగా ఉండి.. మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. అనారోగ్యంతో లేదా శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తులు కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది.

దోసకాయ, కివి రసం

వేసవిలో దోసకాయ మీ బెస్ట్ ఫ్రెండ్ అనొచ్చు. దోసకాయ, కివీని కోసి.. కొద్దిగా అల్లం తురుము వేయండి. దీనిని మిక్సీ చేయండి. ఈ పానీయం రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, బరువు తగ్గడానికి, శరీరంలోని మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది.

ఆమ్ పన్నా

ఆమ్ పన్నా అనేది చాలా మందికి ఇష్టమైన వేసవి పానీయం. పచ్చి మామిడికాయలను గుజ్జు మెత్తబడే వరకు ఉడకబెట్టండి. ఇప్పుడు మామిడి పళ్లను తీసి గుజ్జు తీసేయాలి. కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, పుదీనా ఆకులు, కొద్దిగా చక్కెర వేసి బ్లెండ్ చేయండి. దీన్ని ప్రతిరోజూ తీసుకోవచ్చు.

జీలకర్ర, సోపు, ధనియా పౌడర్..

జీలకర్ర (జీరా), ధనియా పౌడర్, సోపు (సాన్ఫ్)లను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి ఉదయం, నీటిని మరిగించి, వడకట్టండి. కొద్దిగా ఉప్పు, తేనె, నిమ్మరసం వేసి బాగా కలిపి తాగాలి. మీరు తరచుగా అసిడిటీని ఎదుర్కొంటుంటే.. నిమ్మకాయను వదిలివేయండి. ఈ నీరు మీరు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మీ చర్మాన్ని క్లియర్ చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్