Tholi Ekadashi Wishes: తొలి ఏకాదశినాడు ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెబితే శ్రీ మహా విష్ణువు కరుణ కటాక్షాలు లభిస్తాయి
Tholi Ekadashi Wishes: తొలి ఏకాదశి హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగ పూట ఏ పని ప్రారంభించినా అంతా మంచే జరుగుతుందని అంతా నమ్ముతారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలను మీ బంధువులకు, స్నేహితులకు ఇలా చెప్పండి.
Tholi Ekadashi Wishes: ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో విలువ ఉంది. ఆషాడమాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారు. స్వామి నిద్రలోకి జారుకునే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అంటారు. అలాగే ఉత్తర భారతదేశంలో దీన్ని దేవశయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తిని పొందిందని అంటారు. ఈ ఏకాదశిని పరమ పవిత్రంగా నిర్వహించుకుంటారు. తొలి ఏకాదశి నాడు బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పండి. వాట్సాప్ స్టేటస్‌గా కూడా ఈ గ్రీటింగ్స్‌ను పోస్టు చేసుకోవచ్చు.
తొలి ఏకాదశి శుభాకాంక్షలు
1. కరౌ మే
కాళియారాతి: భుజౌ
భక్తార్తిభంజన:
కంఠం
కాలాంబుదశ్యామ:
స్కన్ధౌ మే
కంసమర్ధన:
మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు
2. అచ్యుతం కేశం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్
మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు
3. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా...
అత్యం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షిస్తూ...
అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
4. శ్రీ మహావిష్ణువు కరుణా కటాక్షాలు
మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని
ఆకాంక్షిస్తూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
5. రాక్షసక్షోభిత: సీతయా శోభితో
దండకారణ్యభూపుణ్యతాకారణమ్
మీకు మీ కుటుంబసభ్యులకు
తొలి ఏకాదశి శుభాకాంక్షలు
6. శాంతాకారం భుజగశయనం
పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం
మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం
యోగిభిర్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం
సర్వలోకైకనాథం
7. ముఖం మే పాతు
గోవింద: శిరో
గరువవాహన:
మాం శేషశాయీ
సర్వేభ్యోవ్యాధిభ్యో
భక్తవత్సల:
మీకు మీ కుటుంబసభ్యులకు
తొలి ఏకాదశి శుభాకాంక్షలు
8. రాక్షసక్షోభిత: సీతయా శోభితో
దండకారణ్యభూపుణ్యతాకారణమ్
మీకు మీ కుటుంబ సభ్యులకు
తొలి ఏకాదశి శుభాకాంక్షలు
9. కృష్ణ గోవింద హేరామనారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రినిధే
మీకు మీ కుటుంబ సభ్యులకు
తొలి ఏకాదశి శుభాకాంక్షలు
10. పాలకడలిలో శ్రీమహా విష్ణువు యోగనిద్రలోకి
వెళ్లే పర్వదినాన్ని తొలి ఏకాదశి అంటారు.
ఇంతటి గొప్ప దినాన ప్రజలందిరకీ శుభం
కలగాలని కోరుకుంటూ... తొలి ఏకాదశి శుభాకాంక్షలు
11. అత్యంత ప్రాశస్త్యమైన తొలి ఏకాదశి
పండుగను ప్రజలందరూ నూతన ఉత్సాహంతో
నిర్వహించుకోవాలని ఆకాంక్షిస్తూ...
తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు
టాపిక్