Vegetable Oat Meal Poha | మాన్‌సూన్ మార్నింగ్‌లో మనసు నింపే మంచి బ్రేక్‌ఫాస్ట్!
ఆదివారం మధ్యాహ్నం విందు సంగతి ఓకే. మరి ఉదయం అల్పాహారం కోసం ఏం చేయాలో తోచడం లేదా? అయితే ఇదిగో కూరగాయలతో అటుకులు, ఓట్స్ కలిపి ఆహా అనిపించే రెసిపీ ఇక్కడ పరిచయం చేస్తున్నాం.
ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ కోసం ఎలాంటి ముందస్తు ప్రిపరేషన్ లేనప్పుడు సింపుల్‌గా చేసుకునేలా పోహా, ఓట్స్ వంటివి మనకు అందుబాటులో ఉంటాయి. అయితే విడివిడిగా పోహాను, ఓట్స్ రెసిపీలను మీరు ప్రయత్నించి ఉండవచ్చు. ఈ రెండింటిని కలిపి కూడా అద్భుతమైన అల్పాహారాన్ని సిద్ధం చేసుకోవచ్చు. అటుకులు, ఓట్స్ రెండూ కూడా తేలికైనవి అలాగే ఆరోగ్యకరమైనవి. ఇందులో కొన్ని నట్స్, డ్రైఫ్రూట్స్ కలుపుకుంటే మంచి శక్తి లభిస్తుంది.
ఈ పండగ సీజన్‌లో ఆదివారం రోజున మధ్యాహ్నం నుంచి విందులు, వినోదాలు ఉండవచ్చు. కాబట్టి మీకు మధ్యాహ్నం వరకు ఎంతో శక్తినిచ్చే ఓట్ మీల్ పోహాను సిద్ధం చేసుకోండి. ఇది వంటకం తయారు చేయడం ఎంతో సులభం, దీనిని మీరు 10- 15 నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఓట్ మీల్ పోహా ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటో తెలుసుకోండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా తయారుచేసుకోండి.
కావాల్సిన పదార్థాలు
- 1 కప్పు ఓట్స్
- 1 ఉల్లిపాయ
- 2 పచ్చిమిర్చి
- 1 టమోటా
- 1/3 కప్పు ఉడికించిన తెల్ల శనగలు (కాబూలీ చనా)
- 1 క్యారెట్ తురుము
- 50 గ్రాముల బంగాళాదుంప
- 1 క్యాప్సికమ్ ముక్కలు
- 2 టేబుల్ స్పూన్లు వేయించిన వేరుశెనగ
- 2-3 గ్రాముల ఆవాలు
- 10 గ్రాముల కరివేపాకు
- 1 ఎర్ర మిరపకాయ
- తాజా కొత్తిమీర
- 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
- ఉప్పు రుచికి తగినంత
- 1/2 స్పూన్ పసుపు పొడి
తయారీ విధానం
1. ముందుగా కూరగాయలను ముక్కలుగా కట్ చేసుకొని అన్నింటిని నీటిలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే మెత్తదనం కోసం అటుకులను, ఓట్స్ ను కొద్దిగా నీటితో కడిగి పక్కనపెట్టండి.
2. ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేసి, ఆ తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. ఆపై కరివేపాకు, ఎర్ర మిరపకాయ వేసి వేయించండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి మీడియం మంట మీద వేయించండి.
3. ఉల్లిపాయలు లేత గోధుమరంగు రంగులోకి మారిన తర్వాత టొమాటోలు, అటుకులు, ఓట్స్, పసుపు పొడి, ఉడికించిన కూరగాయలు, ఉడికించిన తెల్ల శనగలు, వేయించిన పల్లీలు, ఉప్పు వేయండి. పైనుంచి కొద్దిగా గరం మసాల కూడా వేయండి.
4. పాన్‌లోని అన్ని పదార్థాలు బాగా కలిసిపోయేలా మెల్లగా కదిలించండి. మంట తక్కువ చేసి కూరగాయలతో పాటు పోహాను 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించండి.
5. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి నిమ్మకాయ రసాన్ని పిండండి, ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేయండి.
అంతే రుచికరమైన ఓట్ మీల్ పోహా సిద్ధమైంది. వేడివేడిగా ఆరగించండి.
సంబంధిత కథనం