Chanakya Niti Telugu : ఈ విషయం డబ్బు కంటే పవర్‍ఫుల్.. మిమ్మల్ని కాపాడుతుంది
Chanakya Niti In Telugu : చాణక్య నీతిలో చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు ఆచార్య చాణక్యుడు. డబ్బు కంటే విలువైన వాటి గురించి వివరించాడు.
ఆచార్య చాణక్యుడు ప్రకారం, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో డబ్బు కంటే ఈ గుణాన్ని ఎక్కువగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీకు కావలసిన విధంగా డబ్బు సంపాదించవచ్చు. కానీ ఈ గుణాన్ని ఈజీగా పొందలేం, కష్టపడాలి. ఆ ప్రత్యేకమైన విషయం ఏంటి?
ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. దానిని పాటిస్తే చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు. చాణక్యుడు ప్రకారం డబ్బు ఉంటే ఎలాంటి సవాలునైనా అధిగమించగలరు. కానీ డబ్బుతో పాటు, ప్రతి వ్యక్తి కలిగి ఉండవలసిన కొన్ని ఇతర లక్షణాలు ఉన్నాయి. అందులో జ్ఞానం ఒక్కటి. జ్ఞానం అనేది సంపద కంటే చాలా గొప్పది. జ్ఞానం గురించి కొన్ని విషయాలను తెలిపాడు. మనిషిలోని ఈ విషయాలు ఇతరులతో పంచుకున్నా తగ్గదు. చాణక్యుడు చెప్పిన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.
చాణక్య నీతి ప్రకారం జ్ఞానం అనేది ఒక వ్యక్తిలో దాగి ఉన్న గొప్ప సంపద. ఎంత పంచుకున్నా జ్ఞానానికి అవధులుండవు. చాణక్యుడు తన చాణక్య నీతిలో జ్ఞానాన్ని కామధేనువుతో పోల్చాడు. కామధేనువు పాలు ఇవ్వడం ఆపదు. అలాగే పంచుకోవడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు జ్ఞానాన్ని పంచుకోండి అంటాడు చాణక్యుడు.
ప్రతి పరిస్థితిలో తన బిడ్డను రక్షించే తల్లితో జ్ఞానాన్ని చాణక్యుడు పోల్చాడు. జ్ఞానంతో ఒక వ్యక్తి తన మార్గాలలో అన్ని కష్టాలను అధిగమిస్తాడు. జీవితంలో మనిషికి ఎన్ని సమస్యలు ఎదురైనా తన జ్ఞానం ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతుకుతాడని చాణక్యుడు చెప్పాడు.
చాణక్యుడు ప్రకారం, జ్ఞానం అనేది ఒక రహస్య సంపద, అది పంచుకున్నప్పటికీ అయిపోదు. జ్ఞానమే చెడు సమయాల్లో సరైన వైపు నడిపిస్తుంది. అంధకారం నుంచి వెలుగులోకి తీసుకొస్తుందని.. అదే జ్ఞానానికి ఉన్న శక్తి అని చాణక్యుడు చెప్పాడు. జ్ఞానాన్ని రహస్య నిధి అని పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే, జ్ఞానం అన్ని సమయాలలో బహిర్గతం కాదు. సమయం వచ్చినప్పుడు మాత్రమే అది వ్యక్తి నుండి బయటకు వస్తుంది. కనుక జ్ఞానం రహస్య నిధి అని చాణక్యుడు చెప్పాడు.
ఒకరి జ్ఞానాన్ని ఒకరికి మాత్రమే పరిమితం చేయడం సరికాదు. ఇతరులతో పంచుకోవడం సమాజానికి మేలు చేస్తుంది. వారికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా అనేక తరాల వారి భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా వృద్ధి చెందుతుందని అంటారు. జ్ఞాన సంపదను ఇతరులతో పంచుకోవడం వల్ల ఆ సంపద పెరిగి సమాజ శ్రేయస్సుకు దోహదపడుతుందని చాణక్యుడు విశ్వసించాడు.