చేతినిండా పని, కంటి నిండా నిద్ర, పర్సు నిండుగా డబ్బులు ఉండాలని కోరుకోనిది ఎవరు? డబ్బు ఆదా చేయాలని, ఖర్చులు అదుపులో ఉండాలని కూడా చాలామందే కోరుకుంటారు. ఇందుకోసం దేవుణ్ని ప్రతిరోజు ప్రార్థించండం, కొన్ని సెంటిమెంట్లను నమ్మడం చేస్తారు. ఇందిలో భాగంగానే కొంతమంది తమ వాలెట్ లేదా పర్సులో డబ్బుతో పాటు మరికొన్ని వస్తువులను ఉంచుకుంటారు.,డబ్బులు, ఖర్చుల విషయం కాకపోయినా కొంతమంది తమ పర్సుల్లో ఫోటోలను, రాగి యంత్రాలను, పాత నాణేలు, దేవుడి చిత్రాలు పెట్టుకోవడం మనం గమనించవచ్చు. అయితే పర్సుల్లో ఇలా ఏది పడితే పెట్టుకోకూడదు. కొన్ని వస్తువులు జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి అని వాస్తు, జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పర్సులో నుంచి కొన్ని వస్తువులను తొలగించకపోతే ఖర్చులు పెరగటం, ఆర్థిక ఇబ్బందులు ఎదురవటం, జీవితంలో ఇతర సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందట. మరి వారి ప్రకారం ఏయే వస్తువులను పర్సుల్లో ఉంచుకోకూడదో ఇప్పుడు తెలుసుకోండి.,ఈ వస్తువులను పర్సులో ఉంచుకోవద్దు ,పూర్వీకుల ఫోటోలువాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో పూర్వీకుల ఫోటోలు ఉంచుకోవడం శుభపరిణామంగా పరిగణించ తగినది కాదు. ఇలా పూర్వీకుల ఫోటోలు ఉంచుకుంటే ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.,బిల్లు పేపర్లు పర్స్‌లో ఎలాంటి లోన్, బిల్లు పేపర్లు, వడ్డీ చెల్లించే వస్తువులను ఉంచుకోవద్దు. ఇలా ఉంచుకుంటే చాలా డబ్బు నష్టం వస్తుందని చెబుతున్నారు.,చిరిగిన పర్సుచాలాకాలం పాటు వాడిన పాత పర్సును, చిరిగిన పర్సును ఉపయోగించవద్దు. దీని కారణంగా జీవితంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందన్ని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే చిరిగిపోయిన మీ పర్సులో కరెన్సీ నోట్లను ఉంచుకుంటే తీవ్ర నష్టంతో పాటు ఇంట్లో దరిద్రం రాజ్యమేలుతుందట.,దేవుడి ఫోటోలు ఉంచుకోవద్దుపర్స్లో దేవుడి చిత్రాలను ఎప్పుడూ ఉంచవద్దు. ఎందుకంటే మనం పర్సును ఎక్కడెక్కడో ఉంచుతాం, మురికి చేతులతో తాకుతాము. ఇలా చేయడం వల్ల అందులోని దేవతలను అపవిత్రం చేసినట్లు అవుతుంది. అది ఏ రకంగానూ మంచిది కాదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.,పర్సులో తాళం చెవులుమీ పర్స్‌లో ఎప్పుడూ తాళం చెవులను కూడా ఉంచవద్దు. వాస్తు ప్రకారం, ఇలా చేయడం ద్వారా డబ్బు కొరతను ఎదుర్కోవలసి ఉంటుంది.,