Diet During Periods : ఋతుస్రావంలో కలిగే నొప్పి తగ్గాలంటే.. ఇవి తినాల్సిందేనట..
Diet During Periods : ఋతుస్రావంలో మూడ్ మార్పులు, అజీర్ణం, చిరాకు, బాధకరమైన తిమ్మిర్లు అమ్మాయిలను ఇబ్బంది పెడతాయి. పైగా ఈ సమయంలో వారు చాలా వీక్‌గా ఉంటారు. అయితే పీరియడ్స్ సమయంలో కొన్ని ఆహారాలు తింటే మీకు ఆ నొప్పి తగ్గి.. ఎనర్జీ వస్తుంది.
Diet During Periods : డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం.. సగానికి పైగా మహిళవు నెలసరి సమయంలో ఎక్కువ నొప్పిని పొందుతారు. కచ్చితంగా చెప్పాలంటే 84 శాతం మంది దీనితో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది.ఈ నొప్పి వారిని చాలా బలహీనంగా చేసేస్తుంది. అందుకే వారు తమ ఋతుక్రమంలో ఉన్నప్పుడు వారి రోజువారీ పనులను పూర్తి చేయడానికి కూడా కష్టపడతారు. పైగా ఆ సమయంలో సరిగా తినరు. కాబట్టి ఇంకా బలహీనపడే అవకాశముంది. అయితే మీ రుతుక్రమ అసౌకర్యం, నొప్పిని తగ్గించడానికి మీరు మీ డైట్లో కొన్ని ఆహారాలు చేర్చుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చేప
పబ్‌మెడ్ సెంట్రల్ ప్రకారం.. మీరు నాన్‌వెజ్ తినేవారు అయితే.. సాల్మన్, మాకేరెల్, హెర్రింగ్, సార్డినెస్ వంటి చేపలు తీసుకోవచ్చు అంటున్నారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ల వల్ల మంటను తగ్గించడంలో సహాయం చేస్తాయన్నారు. ఇవి మానసిక కల్లోలం, చిరాకును తగ్గిస్తున్నట్లు తేలింది.
అంతేకాకుండా ఋతుస్రావం సమయంలోని మొత్తం లక్షణాలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయని రుజువైంది. విటమిన్ B6 రొమ్ము సున్నితత్వం, చిరాకును తగ్గిస్తుంది.
పండ్లు
పండ్లు ముఖ్యమైన పోషకాలు. ఇవి ఆరోగ్య ప్రయోజనాలకు మూలం. అయితే ఈ పోషకాలు.. ముఖ్యంగా పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న పండ్లు పీరియడ్స్ పెయిన్, క్రాంప్‌లను గణనీయమైన స్థాయిలో తగ్గిస్తాయి అంటున్నారు.
అరటిపండ్లు, నారింజలు పొటాషియంకు గొప్ప మూలం. పొటాషియం లేకపోవడం వల్ల కండరాల తిమ్మిరి ఉంటుంది కాబట్టి.. వీటిని తీసుకుంటే కాస్త ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అరటిపండ్లు మలబద్ధకం, ఉబ్బరం (టైమ్స్ ఆఫ్ ఇండియా) వంటి లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
పప్పు
US NIH ప్రకారం.. మీరు మీ పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఐరన్ స్థాయిలు తగ్గుతాయి. ఐరన్, ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే కాయధాన్యాలు ఇనుము స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఫైబర్ కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
అవిసె గింజలు
మెడికల్‌న్యూస్‌టుడే ప్రకారం.. మీ పీరియడ్స్ సమయంలో అవిసె గింజలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీ నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వాటిలో ఉండే కొవ్వు ఆమ్లాలు ప్రొజెస్టెరాన్ ఉత్పత్తిని స్థిరీకరించడంలో సహాయం చేస్తాయి.
అంతేకాకుండా ఇది సంతానోత్పత్తిని పెంచడానికి, మీ గర్భాశయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని మీ స్మూతీ, సలాడ్‌లు, తృణధాన్యాలు లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.
డార్క్ చాక్లెట్
US NIH ప్రకారం.. డార్క్ చాక్లెట్ పీరియడ్స్ క్రాంప్‌లకు సహాయపడుతుంది. కానీ మిల్క్ చాక్లెట్లకు ఇది వర్తించదు. డార్క్ చాక్లెట్‌లో లభించే మెజినియం గర్భాశయ సంకోచాలను, ఫలితంగా వచ్చే తిమ్మిరిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇవి ఈ సంకోచాలను ప్రేరేపించే ప్రోస్టాగ్లాండిన్‌ల ఉత్పత్తిని కూడా తగ్గిస్తాయి.
అయినప్పటికీ డార్క్ చాక్లెట్, దాని తిమ్మిరిని తగ్గించే ప్రభావం మధ్య ఉన్న లింక్ పరిధిని అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.
ఇవే కాకుండా అల్లం, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా మీకు బాగా సహాయం చేస్తాయి. ముఖ్యంగా బచ్చలికూర ఐరన్‌కు గొప్ప మూలం. వీటిని మీరు తరచూ తీసుకుంటే.. పీరియడ్స్ సమయంలో పొందే నొప్పినుంచి కాస్త ఉపశమనం పొందుతారు.
సంబంధిత కథనం